ఏం నాయనా.. బాగున్నావా

ఏం నాయనా.. బాగున్నావా

— రాష్ట్రం గర్వించదగిన నాయకుడు అయ్యావు సంతోషం

—ప్రజా ప్రయోజకుడైన ఆర్థిక మంత్రిని చూసి పొంగిపోయిన విద్యాభ్యాసం నేర్పిన ఉపాధ్యాయుడు

—గురువు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఆర్థిక మంత్రి

పుట్టపర్తి నవంబర్ 11 అనంత జనశక్తి న్యూస్

 

ఆయన సాధారణ ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయ్యారు… తన వద్ద విద్యాభ్యాసం నేర్చుకున్న ఒక విద్యార్థి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగుచేసే ఒక ఆర్థికవేత్త అయితాడని ఏనాడు ఊహించలేదు.అయితే తనకు చిన్ననాటి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుని వద్దకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పైయావుల కేశవ్ … తన గురువుకు కాళ్లు మొక్కి ఆశీర్వాదం కోరాడు… ఈ సంఘటన పవిత్ర ఆధ్యాత్మిక పట్టణమైన పుట్టపర్తిలో చోటుచేసుకుంది..ఉపాధ్యాయుడు గంగాధర శాస్త్రి వద్ద చిన్ననాట మంత్రి పయ్యావుల కేశవ్ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు… పుట్టపర్తి లోని శాంతి నిలయంలో గంగాధర్ శాస్త్రి ఉంటున్న విషయాన్ని తెలుసుకొని వెంటనే ఆర్థిక మంత్రి అక్కడికి వెళ్లి విద్యార్థి దశలో ఆ గురువుతో అనుబంధాన్ని పంచుకున్నారు… ఈ మధ్యకాలంలో తనకు అమితానందం కలిగించిన దినం తన గురువును కలవడమేనని ఈ సందర్భంగా మాంత్రి భావోద్వేగానికి గురయ్యారు…