
మంత్రి నారాయణ చొరవతో నెరవేరనున్న నెల్లూరువాసుల చిరకాల స్వప్నం
నెల్లూరులో ఆధునిక హంగులతో నిర్మితం కాబోతున్న నూతన మార్కెట్ యార్డ్ సముదాయం
నెల్లూరు – నరుకూరు రోడ్డులో స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ
బ్లూ ప్రింట్ ద్వారా మార్కెట్ యార్డ్ నమూనాను పరిశీలించి అధికారులకు దిశ నిర్దేశం చేసిన మంత్రి
దేశంలోనే మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఆధునిక టెక్నాలజీతో మార్కెట్ యార్డ్ ను నిర్మించబోతున్నట్లు స్పష్టం చేసిన మంత్రి నారాయణ
నెల్లూరు నవంబర్ 23, అనంత జనశక్తి న్యూస్
నెల్లూరు నగరవాసుల చిరకాల స్వప్నం నెరవేర్చేల రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మరెక్కడ లేనివిధంగా అత్యాధునిక టెక్నాలజీ తో రూపొందించిన మార్కెట్ యార్డ్ ను నెల్లూరులో నిర్మించేందుకు వ్యూహరచన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం నెల్లూరు నరుకూరు రోడ్డులో ఆధునిక హంగులతో తీర్చిదిద్దనున్న మార్కెట్ యార్డ్ కి సంబంధించిన స్థలాన్ని మంత్రి నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ నమూనాను బ్లూ ప్రింట్ ద్వారా అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అత్యాధునిక వసతులతో కూడిన మార్కెట్ యార్డ్ ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులని మంత్రి ఆదేశించారు. యార్డులో అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. ఈ మార్కెట్ యార్డ్ లో ప్రజలకు అవసరమైన అన్ని వస్తు సామాగ్రి ఒకే చోట లభ్యమయ్యేలా రూపొందించినట్లు మంత్రి స్పష్టం చేశారు. అందుకు తగినట్లు రూపకల్పన చేయాలంటూ అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. తద్వారా దేశంలోనే మరెక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా నెల్లూరులో మార్కెట్ యార్డ్ రూపుదిద్దుకోబోతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యాసంస్థల జియం వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి,టీడీపీ ముఖ్య నేతలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.








