Search
Close this search box.
Search
Close this search box.

సీఎం జగన్ స్ఫూర్తితో.. 17 ఏళ్లకే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సురేష్ బాబు

కర్నూలు ఆణిముత్యం.. ఎవరెస్ట్ పర్వతారోహకుడికి వైఎస్సార్ సీపీ ఆర్థిక సాయం

సీఎం జగన్ స్ఫూర్తితో.. 17 ఏళ్లకే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సురేష్ బాబు

పర్వత శిఖరాలపై నవరత్నాల రెపరెపలు.. సీఎం జగన్ ఫోటో ప్రదర్శన

ఆర్థిక సాయం సాయం అందించి అభినందించిన కర్నూల్ ఎంపీ, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన పర్వతారోహకుడు సురేష్ బాబు (24)కు వైఎస్సార్ సీపీ కర్నూల్ ఎంపీ, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు. 17 ఏళ్ల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సురేష్ బాబు మౌంట్ మనస్లు మరియు మౌంట్ లోట్సే ని అధిరోహించిన మొదటి దక్షిణ భారతీయుడుగా నిలిచారు. సీఎం జగన్ 3,648 సుదీర్ఘ పాదయాత్రకు ముగ్దుడైన సురేష్ బాబు సీఎం జగన్ స్పూర్తితో పర్వతారోహణను అభ్యాసంగా ఎంచుకున్నారు. ఇప్పటి వరకు ఐదేళ్ల కాలంలో 25 పర్వతాలను అధిరోహించిన సురేష్ బాబు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలను సంబంధించిన పోస్టర్లను పర్వతాలపై ప్రదర్శించారు. పర్వతారోహనను కొనసాగించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సురేష్ బాబును వైఎస్సార్ సీపీ గుర్తించింది. ఈ సందర్భంగా కర్నూల్ ఎంపీ, డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి సురేష్ బాబుకు శనివారం నాడు ఆర్థిక సాయం అందించి వైఎస్సార్ సీపీ నేతలు సురేష్ బాబును అభినందించారు. 

కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ సురేష్ బాబు పర్వతారోహణను కొనసాగించాలని దీని కోసం భవిష్యత్తులో ఏ సహాయం అవసరమైనా చేస్తామని భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి సురేష్ కుమార్ కు మరింత సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. సురేష్ బాబు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డుకు సిపాసరు చేస్తామన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సురేష్ బాబును చూసి గర్వపడుతున్నామన్నారు. భవిష్యత్తులో సురేష్ బాబు పర్వతారోహణ కొనసాగేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన సురేష్ బాబు నూతన ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎంపీ, ఎమ్మెల్యే కుమారుడు జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

*నవరత్నాలతో తన జీవితంలో మార్పు..*

సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలతో తన జీవితంలో ఎంతో భరోసా వచ్చిందని, తన కుటుంబ ప్రాథమిక సమస్యలు తొలగిపోయాయని పర్వతారోహకుడు సరేష్ బాబు ఈ సందర్భంగా వివరించారు. సీఎం జగన్ స్పూర్తిగా సాగిన పర్వతారోహణపై సీఎం జగన్ ను ప్రత్యక్షంగా కలిసి చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరారు. మొట్టమొదటి దక్షిణ భారతీయుడిగా తాను అధిరోహించిన మౌంట్ మనస్లు, మౌంట్ లోట్సేపై సీఎం జగన్ ప్రారంభించిన నవరత్నాల (తొమ్మిది సంక్షేమ పథకాలు) బ్యానర్‌ను ప్రదర్శించినట్లు తెలిపారు. తనది నిరుపేద కుటుంబమని తన కలలను సాకారం చేసుకునేందుకు డబ్బులు లేవని, అయితే ముఖ్యమంత్రి తన పాదయాత్రలో 3,648 కి.మీ.ల మేర భారీ దూరం నడవడం చూసి, ఆయన అంకితభావం, నిబద్ధతతో స్ఫూర్తి పొంది నిర్ణయం తీసుకున్నానని ఆ నిర్ణయానికి సీఎం జగన్ అమలు చేసిన నవరత్నాల సాయం తనకు ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు. తాను సాధించిన ఘనత సీఎం జగన్ కు తెలిసిందని చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రపంచం మొత్తం తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి