Logo
Date of Publish : 11 November 2025, 5:16 pm
Editor : Shankaragallu Venkatesulu

సంక్షేమం, సంపద సృష్టి.. అదే ప్రభుత్వ లక్ష్యం..!

సంక్షేమం, సంపద సృష్టి.. అదే ప్రభుత్వ లక్ష్యం..!

జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత

జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి.. ప్రకాశం జిల్లాలో సీఎం పాల్గొన్న 'పరిశ్రమలు - ఉపాధి కల్పన' వర్చువల్ కార్యక్రమానికి హాజరు

జిల్లాలో రూ.4,322 కోట్ల పెట్టుబడులతో 1179.64 ఎకరాల్లో 7 పరిశ్రమల యూనిట్ లకు శంకుస్థాపనలు

కడప, నవంబర్ 11 : అనంత జనశక్తి న్యూస్

ప్రజా సంక్షేమమే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగిస్తూ.. స్థానిక వనరులతో సంపదను సృష్టించే ప్రణాళికలు, ముందుచూపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారని.. జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రశంసించారు.మంగళవారం 'పరిశ్రమలు - ఉపాధి కల్పన'లో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి పరిధిలోని పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కుతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలలోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం జరిగింది.కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షిస్తూ.. స్థానిక కలెక్టరేట్ సభాభవన్ నుండి కడప జిల్లాలో రూ.4,322 కోట్ల పెట్టుబడులతో 1179.64 ఎకరాల్లో 7 పరిశ్రమల యూనిట్ లకు శంకుస్థాపనలు చేసే కార్యక్రమానికి.. ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి లతో పాటు ప్రభుత్వ విప్ లు జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, కడప శాసన సభ్యురాలు ఆర్. మాధవి రెడ్డిలు, కమలాపురం శాసన సభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, ఏపిఐఐసి డైరెక్టర్ ప్రసాద రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి సవిత మాట్లాడుతూ.. అభివృద్దే ద్యేయంగా.. అడుగులేస్తున్న ప్రభుత్వం మనది. ఒకవైపు ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ.. మరొకవైపు సంపదను సృష్టిస్తూ.. లక్షలాదిమందికి.. ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా.. వనరులను సమకూరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపు ఉన్న గొప్ప నాయకుడు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చుస్తే.. పారిశ్రామిక రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది.. ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రానికి అత్యధిక సంఖ్యలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న విజన్ ఉన్న నాయకుడు.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులనుఏర్పాటు చేసి స్థానిక యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలను అందించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. ఈ రోజు జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు శిలాఫలకాలు ఆవిష్కరించడం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరంలోగా ఆయా పార్కుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చి స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు యూనిట్లు నెలకొల్పుకునే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రత్యేకించి.. వైఎస్ఆర్ కడప జిల్లాకు అపారమైన సహజ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒక వైపు పారిశ్రామికంగా, మరోవైపు వ్యవసాయ ఉద్యాన పరంగా అపారమైన ఉత్పత్తి సామర్థ్యం ఉందన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాను భవిష్యత్తులో మరింత అభివృద్ధి వైపు నడిపించేందుకుచేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకి అందిస్తున్న అవకాశాలను సహాయ సహకారాలను అందిపుచ్చుకుని.. జిల్లాను అన్ని విధాలా ముందంజలో నడిపించేందుకు జిల్లా యంత్రాంగం కూడా కృషిచేయడం అభినందనీయం అన్నారు. ఇప్పటికే జిల్లాలో పారిశ్రామిక విప్లవం మొదలైందన్నారు. జిల్లాలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో వేలాది ఎకరాల్లో.. పలు భారీ పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో.. త్వరలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందనున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కడప జిల్లాలో ఏపీఐఐసీకి సంబంధించి రూ.4,322 కోట్ల పెట్టుబడులతో 1179.64 ఎకరాల్లో 7 పరిశ్రమల యూనిట్ (ఎనర్జీ- 1,ఐటీ -1 ఐ &సి- 5) లకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న కొప్పర్తి పారిశ్రామిక వాడను.. రాష్ట్రంలోనే మోడల్ ఇండస్ట్రియల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం కృషిచేస్తోందన్నారు. అందులో భాగంగంగానే.. కొప్పర్తి పారిశ్రామిక వాడలో జిల్లాకే తలమానికంగా "ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)" క్లస్టర్ లో పరిశ్రమలు రూపు దిద్దుకుంటున్నాయన్నారు. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన కంపెనీలు కొప్పర్తి పారిశ్రామిక వాడలో రూపుదిద్దుకుంటున్నాయని.. దీంతో జిల్లా యువతకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు పెరగనున్నాయని.. భవిష్యత్తులో జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధిలోకి రానుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి మూడు ఇండస్ట్రియల్ నోడ్ లను కేటాయించగా అందులో ఒకటి మన జిల్లాలోని కొప్పర్తి ఇండస్ట్రీయల్ పార్కుకు కేటాయించడం గర్వించదగ్గ విషయం అన్నారు.పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాను పరిశ్రమల ఖిల్లాగా.. తీర్చిదిద్దుతున్నారన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి.. వేలాది ఎకరాలను పారిశ్రామిక వాడలుగా రూపుదిద్దుతున్నారన్నారు. రాయలసీమ వాసులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిం చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, నిర్వహణకు గాను త్వరలో కార్యరూపాన్ని ఇవ్వనుందన్నారు.బెంగుళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే మన జిల్లాను కలుపుతూ వెళ్లడంతో పాటు, విమానయాన సర్వీసులను విస్తరించడం వంటి చర్యలు.. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి, ఉత్పత్తుల్ రవాణాకు అనుకూలంగా వుంటుందన్నారు. జిల్లాలోని యూసీఐఎల్ రాష్ట్రానికీ ప్రధాన అణుశక్తి వనరుగా ఉపాధికి ఊతంగా వెలుగొందుతోందన్నారు. జిల్లాలో నాపరాయి పరిశ్రమతో పాటు.. అత్యంత ప్రసిద్ధమైన సిమెంట్ కర్మాగారాలు మెగా ఉత్పత్తితో.. జిల్లా ఆర్థిక అభివృద్ధిలో కీలకమైనవిగా ఉన్నాయన్నారు.జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ..ఎంఎస్ఎంఈలు అనేవి మన దేశ ఆర్థిక బలోపేతానికి ఎంతో ప్రాధాన్యత నిస్తున్నాయని.. ఆ దిశగా.. కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈల పార్కులను ఏర్పాటు చేస్తోందన్నారు. కమలాపురం పరిధిలోని కొప్పర్తి, బద్వేలులోని గోపవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో ఎపిఐఐసి ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి.. లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే చాలా యూనిట్లు నిర్వహణలో ఉంటూ.. రెండవ యూనిట్ల ఏర్పాటు, ప్రొడక్షన్లలోకి అడుగిడాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా ఆర్థికాభివృద్ధికి అని విధాలా సహకారం అందిస్తున్నాయని, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. జిల్లా ఆర్థిక అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సూచించారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కడప జిల్లా.. రాష్ట్రానికే తలమానికంగా.. పారిశ్రామిక రంగంలో ప్రగతి పథంలో అడుగులేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇప్పటికే మొదలైన పారిశ్రామిక విప్లవంతో.. దేశీయ పారిశ్రామిక వేత్తలనే కాకుండా.. విదేశీ కంపెనీలు, పెట్టుబడిదారులను సైతం జిల్లా ఆకట్టుకుంటోందని.. తాజాగా ఎం ఎస్ ఎం ఈ పార్కుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం.. జిల్లాకు శుభ పరిణామం అన్నారు. కడప పట్టణ నియోజకవర్గ పరిధిలో కూడా ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టి సారిస్తే.. పట్టణ ప్రాంత మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకునేందుకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు.కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో లక్షలాది మందికి జీవనోపాధి కల్పన దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక అవకాశాలను అందిస్తున్నాయన్నారు. జిల్లాలో ప్రధాన ఉపాధి వనరుల ఖిల్లాగా కొప్పర్తి ఏపీఐఐసీ మెగా ఇండస్ట్రియల్ హబ్ వెలుగొందుతోందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొరత లేదని జిల్లా యువత ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నైపుణ్య పరంగా ప్రభుత్వం యువతకు అన్ని రంగాల్లో శిక్షణ కూడా అందిస్తుందని.. నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ప్రోత్సాహం అందివ్వడం జరుగుతోందన్నారు.కార్యక్రమానికి హాజరైన జిల్లాకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలను అభినందిస్తూ.. మంత్రి, ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ తోకలిసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం చాంద్ భాష, ఏపిఐఐసి జెడ్ఎం శ్రీనివాస మూర్తి, పారిశ్రామిక వేత్తలు, సంబంధిత అధికారులు, తదితరులు హాజరయ్యారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)