Logo
Date of Publish : 23 November 2025, 3:09 pm
Editor : Shankaragallu Venkatesulu

తెలంగాణ ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం           

తెలంగాణ ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం

పుట్టపర్తి రూరల్: నవంబర్ 23 అనంత జన శక్తి న్యూస్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాలలో భాగంగా ఆదివారం పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కి పుట్టపర్తి విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం పలికారు. ముఖ్యంగా రాష్ట్ర రెవిన్యూ శాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పర్యాటకశాఖమాత్యులు కందుల దుర్గేష్ లు. శ్రీ రేవంత్ రెడ్డి కి ప్రత్యేకంగా భారత స్తూపంను బహుమతిగా మంత్రి సవితమ్మ అందజేశారు. మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, ఎం.ఎస్.రాజు, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తరితరులు. పాల్గొన్నారు. ఆయన విమానాశ్రయం నుండి నేరుగా సమాధి దర్శనం చేసుకుని అనంతరం హిల్హు స్టేడియంలో నిర్వహించే శ్రీ సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)