నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షునికి ఘన సన్మానం
నరసరావుపేట,డిసెంబర్ 04.అనంత జనశక్తి న్యూస్
నరసరావుపేట పట్టణంలో ఎస్ఎస్ఎన్ కాలేజీ కమిటీ నెంబర్ బత్తుల మురళి స్వగృహం నందు ఇటీవల నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు చే నియమించబడిన పొత్తూరి శివప్రసాద్ కి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్య అతిథులుగా కనుమూరి రాజ్యలక్ష్మి,నియోజకవర్గ ప్రోగ్రాం చైర్మన్ తాళ్లూరు సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి గత పది సంవత్సరాలుగా విశేష కృషిచేసిన శివప్రసాద్ కి ఉపాధ్యక్ష పదవి రావటం ఎంతో గర్వకారణమని తెలియజేసినారు.సన్మాన గ్రహీత శివప్రసాద్ మాట్లాడుతూ తన తాతల కాలంనాటి నుండి తెలుగుదేశం పార్టీకి విశేష కృషి ఫలితంగా నాకు ఈ పదవి లభించినదని, పార్టీ బలోపేతానికి పాటుపడతానని తెలియ జేశారు.

ఈ కార్యక్రమంలో బత్తుల మురళి,కనుమూరి రాజ్యలక్ష్మి,తాళ్లూరి సత్యనారాయణ,కొఠారి రంజిత్ కుమార్,చేగు వెంకటేశ్వరరావు,రావిక్రింది వెంకట సుబ్బారావు,బొగ్గరపు బ్రహ్మానందం,ఏవి ఆర్ కె సత్యనారాయణ, వెల్లంపల్లి కేశవరావు, తాడువాయి శ్రీనివాసరావు, కేఎంఎల్ ప్రసాద్,కొత్తమాసు వెంకయ్య,కోట వాణి,దేవిశెట్టి సుధారాణి,కనుమర్లపూడి శారద తదితరులు పాల్గొన్నారు.