Logo
Date of Publish : 17 November 2025, 1:14 pm
Editor : Shankaragallu Venkatesulu

పల్నాడు జిల్లాలో రైల్వే సమస్యలు పరిష్కరించాలని జి ఎం శ్రీ వాస్తవ కు వినతి పత్రం అందజేసిన ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు

పల్నాడులోని రైల్వే సమస్యలను పరిష్కరించండి - సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరిన టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు.

సికింద్రాబాద్,నవంబర్17. అనంత జనశక్తి న్యూస్

పల్నాడు జిల్లా పరిధిలోని పలు రైల్వే సమస్యలను పరిష్కారించాలని సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను టీడీపీ ఫ్లోర్ లీడర్,నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు కోరారు. సికింద్రాబాద్ లో జిఎం ను కలసి ఎంపీ లావు వినతి పత్రాన్ని సమర్పించారు.

ప్రధానంగా పెదకూరపాడులోని ఎల్ సి నెం.27, సత్తెనపల్లిలోని ఎల్ సి నెం.40, పిడుగురాళ్ల మండలం, తుమ్మలచెరువు వద్ద ఎల్ సి నెం. 81 వద్ద మంజూరైన రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబి) నిర్మాణానికి టెండర్లు త్వరగా పిలిచి, ప్రాజెక్ట్ లను పట్టాలెక్కించాలని కోరారు. బెల్లంకొండలోని ఎల్ సి నెం.53 వద్ద ఆర్ఓబి ని మంజూరు చేయాలని కోరారు.గోరిజవోలు మరియు మేరికపూడి గ్రామాల మధ్య ఉన్న ఎల్ సి నెం.గేట్ 294 ను ప్రస్తుత స్థానం నుండి 150 మీటర్లు ప్రక్కకు తరలించాలని అభ్యర్థించారు. మాచర్ల రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఫుట్‌పాత్ నిర్మాణం చేయాలని, కాలువ నిర్మాణం, ఆర్అండ్ బి రోడ్ నుండి మాచర్ల రైల్వే స్టేషన్ వరకు దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు నిర్వహించాలని కోరారు. గురజాల, రెంటచింతల రైల్వే స్టేషన్లలో ప్రాథమిక సౌకర్యాలు,మాచర్ల-విజయవాడ మెము రైల్ (నెం.67228)కు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ వద్ద రైలు నెం.12795/12796 (ఎంప్లాయీస్ రైలు) మరియు రైలు నం.17221/17222 ఎల్ టి టి ఎక్స్‌ప్రెస్‌, భవనగర్ ఎక్స్ ప్రెస్ (రైల్ నెం.12755/12756) లకు స్టాపేజ్ ఇవ్వాలని, పెదకూరపాడు రైల్వే స్టేషన్ లో పల్నాడు ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెం. 12747/12748) కు, డెల్టా ఎక్స్‌ప్రెస్ (రైలు నెం.17645/17646)కు స్టాపేజ్ ఇవ్వాలని, పల్నాడు ప్రాంతంలో ఆలస్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే రైల్వే ప్రయాణీకులకు భద్రత సౌకర్యాలు పటిష్టం చేయాలని కోరారు.పేరేచర్ల రైల్వే స్టేషన్‌లో రైలు.నెం 17254 ఔరంగాబాద్ - గుంటూరు రైల్ ను ఆపాలని అభ్యర్థించారు. గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (నెం.12705/76) పేరును అనవేమ ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చడం విషయంపై అభ్యర్థించారు. పల్నాడు జిల్లా ప్రజలను ప్రభావితం చేస్తున్న కీలకమైన ఈ రైల్వే సంబంధిత సమస్యలపై దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారానికి సహకరించాలన్న ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు కోరిక మేరకు రైల్వే జిఎం సానుకూలంగా స్పందించారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)