Logo
Date of Publish : 18 November 2025, 7:45 am
Editor : Shankaragallu Venkatesulu

వయోవృద్ధుల సంరక్షణకు న్యాయవ్యవస్థ పటిష్టమైన చట్టాలను ఏర్పాటు చేసింది – దివ్వెల శ్రీనివాసరావు,ప్యానల్ న్యాయవాది.

వయోవృద్ధుల సంరక్షణకు న్యాయవ్యవస్థ పటిష్టమైన చట్టాలను ఏర్పాటు చేసింది - దివ్వెల శ్రీనివాసరావు,ప్యానల్ న్యాయవాది.

సత్తెనపల్లి.నవంబర్ 18. అనంత జనశక్తి న్యూస్

పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ హల్లో సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ ఆధ్వర్యంలో,గుంటూరు జిల్లా న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ ఆదేశాలమేరకు, సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ మరియు సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు వయో వృద్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు గా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు పారా లీగల్ వాలంటీర్ జక్కుల లక్ష్మీనారాయణ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జెట్టి సైదులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దివ్వెల శ్రీనివాసరావు వయో వృద్ధులకు కేంద్ర,రాష్ట ప్రభుత్వాలు తీసుకొన్న నిర్ణయాలు గురించి మరియు నిరాదరణకు గురిఅయిన తల్లిదండ్రులు వారి సంతానం నుంచి భరణం పొందే హక్కు ఉందని,తల్లిదండ్రులు బిడ్డలపై లేదా వారి వారసులపై వారి సంరక్షణ బాధ్యత చేపడతారనే ఉద్దేశ్యంతో వారి ఆస్తిని వారి వారసులకు అందజేసిన అనంతరం వారు చూడని పక్షంలో వారి దగ్గర నుంచి తిరిగి పొందే హక్కు ఆ తల్లిదండ్రులకు చట్టం కల్పించిందని ఇంకా పలు చట్టాలను గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో జక్కుల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, దివ్వెల శ్రీనివాసరావు,జెట్టి సైదులు,పోతులూరయ్య ,పారా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)