కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఈ నెల 25 నుండి వాలీ బాల్ పోటీలు - ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు.
నరసరావుపేట,నవంబర్ 22.అనంత జనశక్తి న్యూస్
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ అంతర - కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు మరియు యూనివర్శిటీ సెలెక్షన్స్ ఈ నెల 25, 26, 27 తేదీలలో నిర్వహించ బడునని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలియజేశారు.ఈ వాలీబాల్ పోటీల ప్రారంభకులు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు,నరసరావుపేట నియోజక వర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మరియు A.N.U.రెక్టార్ ప్రో.రామినేని శివరామ ప్రసాద్ పోటీలు ప్రారంభించ నున్నారు.

అనంతరం వాలీబాల్ పోటీలు నిర్వహించబడునని టోర్నమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు తెలియజేశారు.ఈ టోర్నమెంట్ కు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రింద ఉన్న అన్ని అనుబంధ కళాశాలలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు.