Logo
Date of Publish : 28 November 2025, 5:04 pm
Editor : Shankaragallu Venkatesulu

రాష్ట్రంలో యువతీయువకులు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి.

“యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి”

శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,నవంబర్ 28.
అనంత జనశక్తి న్యూస్

పారిశ్రామిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, యువతలో పారిశ్రామిక స్పూర్తిని పెంపొందించడానికి ఉద్దేశించిన పారిశ్రామికవేత్తల నైపుణ్య శిక్షణ కేంద్రం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.వై.పోలి నాయుడు పాల్గొన్నారు.అలాగే ప్రిన్సిపల్ డా. వెంకట్ ఉజ్వల్, ఎన్‌వైకే డిప్యూటీ డైరెక్టర్ జై భారత్, లెక్చరర్ డా.ఆర్. రవిశంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి థ్రెడ్స్ ఐ టి ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్ జి. అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. వక్తలు తమ ప్రసంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో, MSME – World Bank సహకారంతో అమలు చేస్తున్న “ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త” కార్యక్రమం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోందని తెలిపారు. గ్రాడ్యుయేట్ యువతలో సృజనాత్మక నైపుణ్యాలు, శోధనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరమని సూచించారు.ప్రిన్సిపల్ డా. వెంకట్ ఉజ్వల్ మాట్లాడుతూ “పరిశ్రమ స్థాపన ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు. విద్యతో పాటు నైపుణ్య శిక్షణ యువతకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని సమయాన్ని వృథా చేయకుండా ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలి” అని అన్నారు.డా. పోలి నాయుడుమాట్లాడుతూ
“యువత శక్తిని పారిశ్రామిక పురోగతిలోకి తీసుకువెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఎల్లప్పుడూ కళాశాలలో స్వాగతిస్తాము. ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా నోడల్ అధికారి ఉరిటి సాయికుమార్ కి కృతజ్ఞతలు” అని చెప్పారు. అలాగే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న కెరీర్ గైడెన్స్ సమన్వయకర్త డా. రోనంకే రవిశంకర్ సేవలను అభినందించారు.

ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు శిక్షణ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు బాలసుందరరావు, వాసు, వాసుదేవరావు, అనిల్ కుమార్ (సర్టిఫైడ్ ట్రైనర్), రాజు, ఏలియో, బన్నీ తదితర స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)