Logo
Date of Publish : 30 November 2025, 3:15 pm
Editor : Shankaragallu Venkatesulu

విజేతలుగా నిలిచిన ధనలక్ష్మి జూనియర్ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు.

ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు విజేతలు.

బాస్కెట్ బాల్ ఉమెన్ టోర్నమెంట్ – విజేత మౌనిక

నరసరావుపేట,నవంబర్ 30. అనంత జనశక్తి న్యూస్.

అభినందనలు తెలిపిన ఎంఏఎం విద్యాసంస్థల అధినేత మేదరమెట్ల శేషగిరిరావు,రాఖీ కమ్యూనికేషన్స్ అధినేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్.

మేడం మల్లికార్జునరావు, ధర్మపతి మేడం మౌనిక వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బాస్కెట్ బాల్ ఉమెన్ టోర్నమెంట్ మరియు యూనివర్సిటీ సెలక్షన్స్ శుక్రవారం, శనివారం రెండు రోజులు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ సెలక్షన్స్ లో ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు విన్నర్స్ గా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ దాసరి సూర్యనారాయణ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ప్రీతం ప్రకాష్, ఉమ్మడి ఏడుకొండలు, చావలి శ్రీనివాసరావు విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మేదరమెట్ల శేషగిరిరావు విద్యార్థులను అభినందించారు. టిడిపి నాయకులు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాఖీ కమ్యూనికేషన్స్ అధినేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మా సంస్థలో పనిచేస్తున్న మల్లికార్జున భార్యకు బహుమతి రావడం చాలా సంతోషకరంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు సమాజంలో ఆడపిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని వారి కలలను ప్రోత్సహించాలని కోరారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)