Logo
Date of Publish : 02 November 2025, 7:44 am
Editor : Shankaragallu Venkatesulu

కార్తీకమాసంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు

కార్తీకమాసంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు

పంపనూరు ఆలయ అధికారులు, పోలీసులకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశం

పంపనూరు ఆలయంలో ఎమ్మెల్యే సునీత ప్రత్యేక పూజలు

భక్తుల రాక దృష్ట్యా ఏర్పాట్లు, భద్రతా చర్యలు ఉండాలన్న ఎమ్మెల్యే

కార్తీక మాసంలో పంపనూరు సుబ్రమణ్యస్వామి క్షేత్రానికి ఎక్కువ మంది భక్తులు వస్తారని.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. ఆదివారం ఉదయం ఆమె పంపనూరు క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ మంజునాథ స్వామి, పార్వతి అమ్మవార్లను దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎమ్మెల్యే సునీతకు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు అందజేశారు. ఆ తర్వాత భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్తీక మాసం కావడంతో భక్తులు ఎక్కువగా రావటాన్ని ఆమె గమనించారు. ఆలయం సౌకర్యాలపై భక్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా వస్తుంటారని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. పోలీసులు ప్రత్యేక రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, ఇతర మౌళిక వసతులు కల్పించాలని ఆమె ఆదేశించారు.....


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)