Logo
Date of Publish : 12 March 2026, 10:04 am
Editor : Shankaragallu Venkatesulu

తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ కొరత 

తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ కొరత

మూతపడుతున్న హోటళ్లు

తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. మరో రెండు రోజుల్లో పరిస్థితి మారకపోతే చాలా హోటళ్లు పూర్తిగా బంద్ అయ్యే అవకాశం ఉందని హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రత్యేకంగా తిరుపతి నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉందని సమాచారం. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. అయితే కట్టెల ధరలు కూడా పెరగడంతో హోటల్ యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్యాస్ సరఫరాను వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని హోటల్ వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేదంటే వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)