అజిత్ పవార్ ప్రయాణించిన విమాన ప్రమాదంపై విచారణ ప్రారంభించిన పౌర విమానయాన
ఢిల్లీ జనవరి 28 అనంత జనశక్తి న్యూస్
అజిత్ పవార్ ప్రయాణించిన విమానం ప్రమాదానికి గురైన ఘటనపై పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు సంబంధిత అధికారులు, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించాయి.అయితే ప్రమాదం తీవ్రంగా ఉండటంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారి వివరాలు వెల్లడిస్తూ, కాక్‌పిట్‌లో చివరిగా జరిగిన సంభాషణలపై కీలక సమాచారం ఇచ్చారు.ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తును విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో చేపట్టింది. విమానం నుంచి లభ్యమైన బ్లాక్ బాక్స్‌ను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. బ్లాక్ బాక్స్‌ను ఫ్లైట్ రికార్డర్‌గా కూడా పిలుస్తారు. ఇది విమాన ప్రయాణానికి సంబంధించిన కీలక సమాచారాన్ని భద్రపరచే ముఖ్యమైన పరికరం.విమాన ప్రయాణ సమయంలోని సాంకేతిక వివరాలతో పాటు, ప్రమాదానికి ముందు కాక్‌పిట్‌లో జరిగిన సంభాషణలు, అక్కడ వినిపించిన శబ్దాలను కూడా ఈ పరికరం నమోదు చేస్తుంది. ఈ సమాచారం ద్వారా ప్రమాదానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.