కర్ణాటకకు చెందిన తల్లి కొడుకులను కలిపిన జ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓలేటి కుమారి.
సత్తెనపల్లి.నవంబర్ 22. అనంత జనశక్తి న్యూస్
పట్టణంలోని రైల్వే స్టేషన్ లో గత రెండురోజుల క్రితం మాసిపోయిన బట్టలతో మతిస్థిమితం లేక తిరుగుతున్న వ్యక్తిని,ఆటో వాళ్ళు గుర్తించి జ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓలేటి కుమారికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఓలేటి కుమారి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లి మతిస్థిమితం లేని 20 సంవత్సరాల వయసున్న మంజునాథ్ అనే కర్ణాటకకు చెందిన వ్యక్తిని అక్కున చేర్చుకొని జ్యోతి ఫౌండేషన్ ఆశ్రమానికి తీసుకుని వచ్చి, సపర్యలు చేసినారు.అతనికి స్నానం చేయించే క్రమంలో అతని చేతిమీద ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా కర్ణాటకలో ఉన్న అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి,వారి తల్లిదండ్రుల వద్ద ఉన్న అన్ని ఆధారాలను పరిశీలించి,వారికి వారి కుమారుడ్ని అప్పగించడం
జరిగిందన్నారు.

ఈ సందర్భంగా అబ్బాయి తల్లి అన్నపూర్ణ మాట్లాడుతూ మా అబ్బాయి ఐదు నెలల క్రితం తప్పిపోయినాడు. చుట్టూ పరిసర ప్రాంతాలలో చాలా వెతికినాము.మా అబ్బాయి జాడ మాకు ఎక్కడ లభించలేదు.సత్తెనపల్లిలో మా అబ్బాయి ఉన్నాడని,జ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓలేటి కుమారి ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్ లో మా అబ్బాయిని చూసుకొని చాలా సంతోషించాము.మా కుమారుడ్ని మాకు అప్పగించిన జ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓలేటి కుమారికి ధన్యవాదాలు.ఈ సందర్భంగా అడ్వకేట్ దివ్వెల శ్రీనివాసరావు, సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పొతుగంటి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతతో ప్రతిరోజు రోడ్ల పైన, దిక్కులేని అనాధలకు సేవ చేస్తూ ఆటోలలో వెళ్లి వారికి ఆహారం అందిస్తూ, ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తున్న జ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓలేటి కుమారిని వారు అభినందించారు.భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతంగా ఎదగాలని వారు ఆకాంక్షించారు.