Logo
Date of Publish : 22 January 2026, 4:58 am
Editor : Shankaragallu Venkatesulu

బస్ షెల్టర్ కు అడ్డంగా ఉన్న తోపుడుబండ్లను తొలగించండి ఎంపీడీవో నసీమా

బస్ షెల్టర్ కు అడ్డంగా ఉన్న తోపుడుబండ్లను తొలగించండి ఎంపీడీవో నసీమా

తలుపుల జనవరి21  అనంత జనశక్తి న్యూస్

మండల కేంద్రంలో స్థానిక మూడు రోడ్ల కూడలి నందు రోడ్డుకు ఇరువైపులా ఇష్టానుసారంగా తోపుడుబండ్లు ఉంటున్నాయని అలాగే ప్రయాణికులు బస్సు షెల్టర్ కు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎంపీడీవో నసీమా తోపుడు బండ్లు యాజమాన్యల పై ఆగ్రహించారు. బస్సు సెంటర్ వద్ద బస్సు ఆపి ప్రయాణికులకు సహకరించాలని పలువురికి సూచించారు. విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థులు బస్సు షెల్టర్ కు దారి లేక కిరాణా దుకాణల వద్ద వేచి ఉన్నారని గమనించిన ఎంపీడీవో నసీమా ఎట్టి పరిస్థితుల్లోను విద్యార్థులకు ఇబ్బందులు కలవకుండా వారి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బస్సు షెల్టర్ చుట్టుపక్కల ఇష్టానుసారంగా తోపుడు బండ్లు ఉంచితే అలాంటి వారి పైన జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రెండు రోజుల లో వారికి నోటీసులు అందజేయాలని పంచాయతీ కార్యదర్శి రవణప్ప నాయుడుకు ఆదేశించారు.అమ్మయ్య తమ సమస్య తీరినట్లే

ఎంపీడీవో నసీమా కు విద్యార్థులు కృతజ్ఞతలు

తలుపుల మారుమూల గ్రామాల నుంచి విద్యార్థులందరూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో మండల కేంద్రంలో స్థానిక మూడు రోడ్ల కోడలి సమీపంలో ఉన్న బస్సు షెల్టర్ కు విద్యార్థులు వెళ్లాలంటే తోపుడు బండ్లు ఇష్టానుసారంగా అడ్డంగా ఉంచారని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే వారమని తామంత స్వగ్రామానికి వెళ్లాలంటే విద్యార్థులందరూ కలిసి అక్కడక్కడ దుకాణ దారుల వద్ద నిలిచే వారమని అమ్మయ్య నేటికి తమ సమస్య పరిష్కరిస్తున్న ఎంపీడీవో కు విద్యార్థులు ధన్యవాదాలు తెలుపుకున్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)