తిరుమల లో మొత్తం 108 దివ్య తీర్ధాలు

వాటిలో నాగ తీర్దం ప్రముఖంగా చెప్పవచ్చు.
తిరుమల అనంత జనశక్తి న్యూస్
తిరుమల ప్రాంతం అంతా ఆద్యాత్మిక,ఆహ్లాద ప్రాంతమే కాక అనేక వింతలు,అద్బుత ప్రదేశాలు కలిగిన ప్రాంతం గా అందరికి తెలిసిందే,నేడు తిరుమల లో పవిత్ర నాగ తీర్ధ విశేషాలు తెలుసుకుందాం.తిరుమల గిరులు ఆది శేషుని అవతారంగా ఇతిహాసాలు చెపుతున్నాయి. శ్రీనివాసుడు లక్ష్మీ అమ్మవారి వియోగం తో వైకుంఠం వీడి భూలోకం వచ్చి ఈ ప్రాంతం లోనే ఒక పుట్టలో తపస్సు చేసారని చెపుతారు.ఇక్కడ నాగుల బావి లేదా నాగ తీర్ధం గా పిలవబడే కొలను ఉంటుంది,ఈ తీర్ధం ఎండాకాలం లో కూడా ఎండిపోక పుష్కలంగా నీరు కలగి ఉంటుంది,దీనిలో నీరు సేవిస్తే అనారోగ్యాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం,ఈ ప్రాంతం లో ఒక పెద్ద కొండ రాయి కి నాగ జాతి కి చెందిన అన్ని రకాల సర్పాలు చెక్కబడి ఉంటాయి, అవి అతి పురాతన మైనవి చెపుతారు,నాగ దోషం ఉన్నవారు ఈ శిల్పాలను పూజిస్తే దోషాలు నయమవుతాయని నమ్మకం.స్వామి వారి తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం లో ఒకప్పుడు ఋషులు తపస్సు చేసి మోక్షం పొందేవారని చెపుతారు. శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా,చక్ర తీర్ధాన దిగువన పసి గంగమ్మ ఆలయానికి ఎగువ గా ఈ నాగతీర్ధం ఉంటుంది, తిరుమల సందర్శించినప్పుడు స్తానికుల సహకారం తో ఈ ప్రాంతానికి చేరవచ్చు.నాగుల చవితి కి విశేష సంఖ్య లో భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి పూజలు చేస్తారు.ఈ ప్రాంతం లో పెరిగే చెట్లు కూడా సర్పాల ఆకారం లో ఉంటాయి. నాగ తీర్ధం లో నీరు అతి స్వచ్చంగా ఉంటాయి,ఇక్కడ కనిపించే కొండ రాళ్లు కూడా సర్పాల ఆకారం లో ఉండటం విశేషం.ఈ ప్రాంతం లో సర్పాలకు నిలయం అయిన మొగలి పొదలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతం లో కొండలపై జంట నాగులు,ఐదు తలల నాగులు ఇలా అనేక సర్పాల బొమ్మలు చెక్కబడి కనిపిస్తాయి,ఆ శిలలు కొన్ని వందల సంవత్సరాల క్రితం చెక్కబడి నట్లు చెపుతారు.ఇక్కడ కనిపించే పెద్ద వృక్ష్లాల కాండాలు కూడా సర్పాల కు ఉండే పొలుసులు రూపం లో కనిపిస్తాయి.అతి కీకారణ్య మార్గం లో ఉండే ఈ ప్రాంతం కు తిరుమల ప్రాంత గైడులు,స్తానికులు,ట్రావెల్స్ వారి సహకారం తో చేరుకోవచ్చు,ఈ నాగ తీర్ధం చూసిన వారు నిజంగా నాగ లోకం చూసినట్లు గా అనుభూతి పొందుతారు.మిత్రులారా ఈ సారి తిరుమల వెళ్ళినప్పుడు చూడని వారు తప్పక ఈ సుందర,ఆద్యాత్మిక ప్రాంతాన్ని దర్శించండి