Logo
Date of Publish : 22 November 2025, 8:31 am
Editor : Shankaragallu Venkatesulu

జెండర్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు.

నాదెండ్లలో జెండర్ రిసోర్స్ కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
నాదెండ్ల,నవంబర్ 21.అనంత జనశక్తి న్యూస్
మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుభోదయం నాదెండ్ల మండల సమాఖ్య నిర్వహణలో నడిచే జెండర్ రిసోర్స్ కేంద్రాన్ని (ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రం) మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నేడు ప్రారంభించారు.నియోజకవర్గ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, సంఘాలలో లేని మహిళలు ఎదుర్కొనే కుటుంబ, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఈ కేంద్రం పనిచేస్తుందని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి వివరించారు.మహిళల భద్రత కోసం SRLM ,NRLM, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే అత్యవసర స్పందన, రక్షణ,తక్షణ చర్యలు, వైద్యం సదుపాయం, చికిత్సలు, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వీలుగా సలహాలు, న్యాయ సహాయం, మహిళలు మానసిక ఆందోళనలకు గురి అయిన సందర్భాల్లో చేయూత, సామాజిక భద్రత వంటి తదితర అంశాల్లో ఈ కేంద్రం మహిళలకు బాసటగా నిలుస్తుందని ఆమె వివరించారు. జిల్లాకు కేటాయించిన 6 కేంద్రాల్లో చిలకలూరిపేట నియోజక వర్గంలో ఒకటి ప్రారంభించడానికి కృషి చేసిన పీడీ ఝాన్సీ రాణిని ప్రత్తిపాటి అభినందించారు. ఈ కేంద్రం ద్వారా మహిళలకు సత్వర న్యాయం జరగాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు.

మహిళలు, చిన్నారుల భద్రత, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కృషి చేస్తున్నట్లు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం నాదెండ్ల బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా డ్వాక్రా మహిళలకు మంజూరైన రూ. 87 లక్షల ఋణాలకు సంబంధించిన చెక్కులను ప్రత్తిపాటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బరోడా బ్యాంక్ మేనేజర్ విశ్వనాధంను ప్రత్తిపాటి సహా అందరూ అభినందించారు. తరువాత అంగన్వాడీ కేంద్రాలకు ప్రీ స్కూల్ కిట్లను సీడీపీవో శాంతకుమారితో కలిసి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజనీ కుమారి, పింఛన్ల విభాగం డిపిఎం మల్లీశ్వరి,ఎపిఎం రమేష్ బాబు, తహశీల్దార్ కుటుంబరావు,ఎంపీడీవో స్వరూపరాణి, సీసీలు హేమలత,సుధ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ కరిముల్లా, నాదెండ్ల సొసైటీ అధ్యక్షులు నల్లమోతు హరిబాబు,నెల్లూరి కోటేశ్వరరావు,వేములపల్లి బసవయ్య,దడదాసుల శరత్, సుభాని,గుఱ్ఱం నాగపూర్ణ చంద్రరావు,వలేటి హిమవంతరావు,వజ్జా సింగయ్య,మురుకుట్ల సాంబశివ రావు,రామారావు, యనమదల సూర్యనారాయణ, నెల్లూరి వెంకయ్య, వేములపల్లి రామారావు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)