Logo
Date of Publish : 26 November 2025, 3:22 pm
Editor : Shankaragallu Venkatesulu

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం – మిత్ర మండలి అధ్యక్షుడు శిఖా శాంసన్

ఘనంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం

క్రోసూరు,నవంబర్26.అనంత జనశక్తి న్యూస్

క్రోసూరు గ్రామంలో శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో మిత్రమండలి అధ్యక్షులు శిఖా శాంసన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మన రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించి చట్టంగా మార్చిందన్నారు మన రాజ్యాంగం జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు మనం అందరం రాజ్యాంగానికి విధేయులుగా మన దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని శాంసన్ పిలుపునిచ్చారు.మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి అందుకోసం దేవుని మీద కానీ, మహానుభావుల మీద గాని ఆధారపడవద్దని అంబేద్కర్ అన్నారని ఆయన పేర్కొన్నారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశేష కృషి చేశారన్నారు రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.అంబేద్కర్ ఈ దేశప్రజల ఉమ్మడి ఆస్తి అన్నారు.ఆయన ఆలోచనలు ఆదర్శాలు నేటి తరానికి కాక భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మిత్రమండలి కార్యదర్శి షేక్ జానీ భాష తదితరులు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)