Logo
Date of Publish : 08 November 2025, 11:33 pm
Editor : Shankaragallu Venkatesulu

ఘనంగా ఆంజనేయస్వామి‌ గ్రామోత్సవం

ఘనంగా ఆంజనేయస్వామి‌ గ్రామోత్సవం

యాడికి, నవంబర్ 8, అనంత జనశక్తి న్యూస్ : మండల కేంద్రంలోని చింతవనం ఆంజనేయస్వామి దేవాలయం నుండి ఆంజనేయస్వామి గ్రామోత్సవంను గురుస్వామి డేరంగుల నాగశేఖర్ ఆధ్వర్యంలో శనివారం ఆంజనేయస్వామి దీక్షాపరులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీరాముడు కి , సీతమ్మ కు, లక్ష్మణుడు కి, ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకాలు చేసి,తమలపాకులతో అలంకరణ చేశారు . మహా మంగళహారతులను సమర్పించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, శ్రీరాముడు ని , సీతమ్మ ను , లక్ష్మణుడు ని, ఆంజనేయస్వామి ని దర్శించి, టెంకాయలను, కానుకలను సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.‌ మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు.సాయంత్రం శ్రీరాముడు , సీతమ్మ, లక్ష్మణుడు ,ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులను ట్రాక్టర్ లో ఉంచి, ట్రాక్టర్ ను పూలమాలలతో అలంకరణ చేశారు.పురవీధుల గుండా మేళా తాళాలతో ఆంజనేయస్వామి ని ఊరేగించారు. జై శ్రీరాం...జై జై శ్రీ రాం......,జై అంజనేయ..జై జై అంజనేయ అనే నామం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో జయరాముడు,పూలతోట రామాంజి, ఠాగూర్ ,జయరాముడు,రాహుల్ ,గౌడ్ ,దుర్గా,కుమార్ ,భార్గవ్ , అంజి, భక్తమండలి పాల్గోన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)