హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈ గురువారం విడుదల అవుతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఇప్పుడు, హైదరాబాద్‌లోని సంధ్య 35 MM థియేటర్లో మే 11 సాయంత్రం 04:59 గంటలకు విడుదల అవుతున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మాస్ ఎంటర్టైనర్లో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.