Logo
Date of Publish : 06 January 2026, 4:17 am
Editor : Shankaragallu Venkatesulu

చైనా మాంజాపై తెలంగాణ ప్రభుత్వ నిషేధం

చైనా మాంజాపై తెలంగాణ ప్రభుత్వ నిషేధం

హైదరాబాద్ జనవరి 06 అనంత జనశక్తి న్యూస్

పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం చైనా మాంజా విక్రయం, వినియోగం చట్టరీత్యా నేరం అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.నిషేధాన్ని ఉల్లంఘిస్తే 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లోని ధూల్‌పేట్, మంగళ్‌హాట్, బేగంబజార్ ప్రాంతాల్లో చైనా మాంజాను దొంగచాటుగా విక్రయిస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి, సుమారు పది లక్షల రూపాయల విలువైన చైనా మాంజాను సీజ్ చేశారు.

చైనా మాంజా వల్ల

పక్షులు, జంతువులు మృతి చెందుతున్నాయి

ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాల ప్రమాదం

మెడ, ముఖానికి తగిలితే ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి

ప్రజలు చైనా మాంజాను వాడకూడదని, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)