Logo
Date of Publish : 03 December 2025, 12:49 pm
Editor : Shankaragallu Venkatesulu

ఐబొమ్మ రవి కేసులో సంచలన వివరాలు వెలుగులోకి

ఐబొమ్మ రవి కేసులో సంచలన వివరాలు వెలుగులోకి

హైదరాబాద్ డిసెంబర్ 03, అనంత జనశక్తి న్యూస్

ఐబొమ్మ రవి కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా రవిని పోలీసులు పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అతను సైబర్ క్రైమ్‌లో ఉద్యోగం చేస్తావా అని ప్రశ్నించగా, జైలుకి బయటికి వచ్చిన తర్వాత సక్రమ మార్గంలో నడవాలని, తనకు రెస్టారెంట్ పెట్టే ఆలోచన ఉందని రవి తెలిపినట్లు తెలుస్తోంది.తాను చేసిన తప్పును గ్రహించానని, ఇకపై ఎప్పుడూ పైరసీ కార్యకలాపాల జోలికి వెళ్లనని రవి విచారణలో పేర్కొన్నాడు. అంతేకాదు, వచ్చిన 17 కోట్లు పూర్తిగా ఎంజాయ్ చేసేందుకే ఖర్చు చేశాను అని కూడా రవి వెల్లడించినట్టు సమాచారం.ఇదే సమయంలో, రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు కొద్ది సేపట్లో తీర్పు వెలువరించనుంది. దీంతో ఈ కేసు చుట్టూ మరోసారి ఉత్కంఠ నెలకొంది.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)