తండ్రి మృతి.. పరీక్షలకు కుమారుడు
తెలంగాణ “అనంత జనశక్తి న్యూస్”
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. తండ్రి మరణాన్ని దిగమింగుకుని ఓ విద్యార్థి పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన ఘటన అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.మోత్కూరుకు చెందిన కూరెళ్ళ ఎల్లయ్య నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన గుండాల మండలం వస్తకొండూరులో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబం విషాదంలో మునిగిపోయినా, కుమారుడు హర్షవర్ధన్ తన బాధను దిగమింగుకుని ఈ రోజు ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యాడు. తండ్రి కలను నెరవేర్చాలనే సంకల్పంతో పరీక్షకు హాజరైన హర్షవర్ధన్ ధైర్యాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.ఈ ఘటన మోత్కూరు ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.