Logo
Date of Publish : 16 June 2026, 10:28 am
Editor : Shankaragallu Venkatesulu

హైదరాబాద్‌లో ఏసీబీ దాడులు..

హైదరాబాద్‌లో ఏసీబీ దాడులు..

డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం

హైదరాబాద్, జూన్ 16:అనంత జనశక్తి న్యూస్

హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహిస్తున్న సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో భారీ మొత్తంలో నగదు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సోదాల సందర్భంగా రూ.1 కోటి నగదు ఉన్న బ్యాగ్‌ను గుర్తించినట్లు సమాచారం. అలాగే పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంకు నిల్వల వివరాలు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది.నరహరి అత్తమామల పేర్లపై పెద్ద మొత్తంలో స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తూ ఆస్తుల విలువ, ఆదాయ వనరులపై విచారణ కొనసాగిస్తున్నారు.అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, బ్యాంకు డిపాజిట్లు, ఆస్తుల వివరాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. సోదాలు పూర్తయ్యాక పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)