Logo
Date of Publish : 14 March 2026, 5:33 pm
Editor : Shankaragallu Venkatesulu

బండి సంజయ్ పాదయాత్రలో తేనెటీగల కలకలం

బండి సంజయ్ పాదయాత్రలో తేనెటీగల కలకలం

కరీంనగర్ మార్చి 14, అనంత జనశక్తి న్యూస్

కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్వహిస్తున్న ‘అంజన్న ఆశీర్వాద’ పాదయాత్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కోనరావుపేట సమీపంలో పాదయాత్ర దృశ్యాలను చిత్రీకరించేందుకు వినియోగించిన డ్రోన్ కెమెరా పొరపాటున తేనెతుట్టను తాకింది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన తేనెటీగలు అక్కడ ఉన్న కార్యకర్తలపై దాడి చేశాయి.ఈ ఘటనలో నలుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు. కొద్దిసేపు అంతరాయం ఏర్పడినప్పటికీ పరిస్థితి సద్దుమణిగిన అనంతరం పాదయాత్రను తిరిగి కొనసాగించారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)