జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో సుధీర్ కొనసాగుతున్న సమయంలో అతనితో కలిసి పెద్ద ఎత్తున రొమాన్స్ చేస్తూ స్కిట్లు చేయడమే కాకుండా పలు స్పెషల్ ఈవెంట్స్ లో వీరిద్దరూ తప్పకుండా పర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. ఇక వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి చాలా మంది నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అంటూ సందేహాలను వ్యక్తపరిచారు.ఇక సుధీర్(Sudheer) రష్మీ ఎన్నోసార్లు ఈ విషయంపై స్పందిస్తూ తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పినప్పటికీ వీరి గురించి వచ్చే వార్తలు మాత్రం ఆగడం లేదు.సుధీర్ ఈటీవీ కార్యక్రమాలకు దూరమైనప్పటికీ రష్మీ సుధీర్ గురించి వచ్చే వార్తలు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా సుధీర్ అంటే తనకు ఎంత ఇష్టం అనే విషయాన్ని రష్మీ బయటపెట్టారు. దీంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ మరోసారి వీరి రిలేషన్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రష్మీ నటుడు బ్రహ్మాజీతో కలిసి ఓంకార్(Omkar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రష్మీ బ్రహ్మాజీతో కలిసి పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక ఓంకార్ సైతం వన్ సెకండ్ అనే వర్డ్ ఉపయోగిస్తూ బాగా ఇరిటేట్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఓం కార్ రష్మీకు ఒక చిక్కు ప్రశ్న వేశారు.రష్మీ మీరు కనుక ఒంటరిగా ఐలాండ్ లో ఉంటే మీకు కంపెనీగా ఏ హీరో ఉండాలని కోరుకుంటారు అంటూ ప్రశ్నించారు. ఏ హీరోతో అయితే బాగుంటుందని భావిస్తారు అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు కొంత సమయం పాటు ఆలోచించిన రష్మీ అనంతరం సుధీర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను అని సమాధానం చెప్పడంతో ఒకసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఐలాండ్ లో ఒంటరిగా ఉంటే సుధీర్ తోడు ఉంటే బాగుంటుందని తన కంపెనీ అయితే బాగుంటుందని రష్మీ సుధీర్ పై ఉన్నటువంటి ప్రేమను ఇలా బయటపెట్టారంటూ కామెంట్ చేస్తున్నారు.