Logo
Date of Publish : 04 April 2026, 10:06 am
Editor : Shankaragallu Venkatesulu

పూటకో ఒక మాట మార్చే వ్యక్తి జగన్

*పూటకో ఒక మాట మార్చే వ్యక్తి జగన్

జగన్ వైసీపీ నేతలు తీరుతో ఈసారి ఆ పార్టీకి 11 సీట్లు కూడా రావు

పెనుకొండలో రూ.40 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ

పూల మార్కెట్ ప్రారంభించిన మంత్రి సవిత

పెనుకొండ ఏప్రిల్ 04, అనంత జనశక్తి న్యూస్

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత తెలిపారు. ఈ సందర్భంగా రూ.40 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఘనగిరి పూల మార్కెట్‌ను ప్రారంభించారు.మంత్రి సవిత మాట్లాడుతూ, చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు రూ.6 లక్షలతో పూల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించేందుకు రూ.50 లక్షలతో శానిటేషన్ సెంటర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. త్వరలోనే రూ.5 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.ఇంకా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మడకసిర రోడ్ వరకు కూడా సెంటర్ లైటింగ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, పెనుకొండ నియోజకవర్గానికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సవిత జగన్‌పై విమర్శలు చేశారు. గంటకో మాట మార్చే వ్యక్తి జగన్ అని, పార్టీ ఉనికికోసమే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని అన్ని పార్టీలూ అమరావతికి మద్దతు పలికినా, వైసీపీ మాత్రమే మద్దతు ఇవ్వలేదని అన్నారు.అమరావతి రైతులు, మహిళలను ఇబ్బందులకు గురిచేసిన కారణంగా వైసీపీకి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో గతంలో వచ్చిన సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా వ్యవహరించే వ్యక్తి జగన్ అని విమర్శించారు.రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారని, ప్రజల ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల వైసీపీ అధికారంలోకి రావడం కేవలం కలగానే మిగిలిపోతుందని మంత్రి సవిత పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)