Logo
Date of Publish : 09 March 2026, 3:19 pm
Editor : Shankaragallu Venkatesulu

మహిళల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం

మహిళల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

స్త్రీ విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం

పెనుకొండలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

4000 మంది మహిళలకు పసుపు కుంకుమలు పంపిణీ

పెనుకొండ మార్చి 09 అనంత జనశక్తి న్యూస్

మహిళల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మహిళలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబుదేనని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సగ భాగం హక్కు కల్పించిన అన్న ఎన్టీఆర్ కల్పిస్తే, విద్యా, ఉద్యోగాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం చంద్రబాబుదన్నారు. డ్వాక్రా సంఘాలను స్థాపించి వంటింటికే పరిమితమైన మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచి, ఆర్థిక స్వాతంత్ర్య తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. రాజకీయాల్లో కూడా మహిళలకు అగ్రతాంబూలం వేస్తున్న ఘనత కూడా ఆయనదేనన్నారు. దీపం -1, దీపం -2 పథకాల రూపకల్పన చేశారన్నారు. స్త్రీ విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. తల్లికి వందన పథకం ద్వారా ఇంటిలో ఎందరు బిడ్డలు ఉంటే, అందరికీ రూ.15 వేలు చొప్పున అందజేస్తున్నామన్నారు. అయిదేళ్ల జగన్ పాలనలో మహిళలను అన్ని విధాలా అవమానాల పాలయ్యారన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో, సీఎం చంద్రబాబునాయుడు ఎంఎస్ఎంఈ పార్కుల్లో వారికి పెద్దపీట వేస్తున్నారన్నారు. జిల్లాలో పెనుకొండలో అత్యధికంగా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రణాళికులు సిద్ధం చేశామన్నారు. ఆసక్తి కలిగిన వారు ముందుకొస్తే, వారి చేత మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఉత్పత్తులు తయారు చేసేలా శిక్షణ అందజేసి, రుణాలిచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామన్నారు.

 

*భారీగా తరలొచ్చిన మహిళలు*

 

పెనుకొండలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు నియోజక వర్గ వ్యాప్తంగా నాలుగు వేలకు పైగా మహిళలు పెద్ద ఎత్తున తరలొచ్చారు. వచ్చిన వారందరికీ మంత్రి సవిత చీర, గాజులతో కలిపి పసుపు కుంకుమ అందజేశారు. అంతకుముందు తన తండ్రి ఎస్.రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ ను మంత్రి సవిత ప్రారంభించారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ర్యాలీగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి తరలొచ్చారు. డ్వాక్రా సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, సతీష్ కుమార్, ఇతర అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)