నెలసరి తప్పనిసరి సెలవు చేస్తే మహిళల ఉపాధి అవకాశాలకు దెబ్బ: సుప్రీంకోర్టు
న్యూ ఢిల్లీ మార్చి 13"అనంత జనశక్తి న్యూస్"
నెలసరి సమయంలో మహిళలకు తప్పనిసరిగా ప్రత్యేక సెలవు ఇవ్వాలనే అంశంపై సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెలవును చట్టబద్ధంగా తప్పనిసరి చేస్తే మహిళల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.ఈ విషయంపై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ మాట్లాడుతూ, నెలసరి సెలవును తప్పనిసరి చేస్తే కొన్ని సంస్థలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడంలో వెనుకంజ వేయవచ్చని అన్నారు. అలాంటి చట్టం మహిళల్లో తాము పురుషుల కంటే తక్కువ సామర్థ్యం కలవారమనే మానసిక భావనను కలిగించే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు.మహిళలకు నెలసరి సెలవులపై స్పష్టమైన నిబంధనలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర త్రిపాటి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. మహిళల హక్కులను పరిరక్షించడమే కాకుండా, ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడకుండా సమతుల్యత అవసరమని కోర్టు సూచించింది.