పిఠాపురంలో కళ్యాణ్ కు లక్ష మెజారిటీ : హైపర్ ఆది
పిఠాపురం ఏప్రిల్ 11,అనంత జనశక్తి న్యూస్
పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు లక్ష కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ హైపర్ ఆది అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా పవన్ కల్యాణ్ తమ ఓటు అంటున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ సొంత డబ్బుతో అభివృద్ధి చేయగల సమర్థుడని అన్నారు. హైదరాబాద్ను సందర్శించేందుకు విదేశాల నుంచి ఎలాగైతే వస్తున్నారో పవన్ కల్యాణ్ గెలిస్తే పిఠాపురాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు అలాగే వస్తారు.