Logo
Date of Publish : 14 March 2026, 5:40 pm
Editor : Shankaragallu Venkatesulu

10 మిస్సైళ్లను ప్రయోగించిన ఉత్తర కొరియా

10 మిస్సైళ్లను ప్రయోగించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా"అనంత జనశక్తి న్యూస్"

పశ్చిమాసియా ఇప్పటికే రణరంగంగా మారిన నేపథ్యంలో మరోసారి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగేలా ఉత్తర కొరియా చర్యలు చేపట్టింది. జపాన్ వైపు సముద్రంలో ఒకేసారి 10 బాలిస్టిక్ మిస్సైళ్లను ఉత్తర కొరియా ప్రయోగించింది.ఈ విషయాన్ని దక్షిణ కొరియా అధికారికంగా ధ్రువీకరించింది. రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీప ప్రాంతం నుంచి ఈ మిస్సైళ్లను ప్రయోగించినట్లు వెల్లడించింది.అమెరికాతో కలిసి దక్షిణ కొరియా నిర్వహిస్తున్న సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో నిఘాను మరింత పెంచినట్లు దక్షిణ కొరియా తెలిపింది.ఈ విషయాన్ని అమెరికా, జపాన్ దేశాలతో కూడా పంచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)