Logo
Date of Publish : 23 March 2026, 4:39 am
Editor : Shankaragallu Venkatesulu

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ కొత్త వ్యూహం:

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ కొత్త వ్యూహం:

నౌకలపై 2 మిలియన్‌ డాలర్ల సుంకం?

ప్రపంచ నౌకా రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిపై తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకునే దిశగా ఇరాన్‌ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ కీలక సముద్ర మార్గం గుండా వెళ్లే కొన్ని ట్యాంకర్లపై 2 మిలియన్‌ డాలర్ల వరకు సుంకం విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ భారీ రుసుము విధానం ద్వారా ఆ జలమార్గంపై నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయాలని ఇరాన్‌ భావిస్తున్నట్లు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం ఇరాన్‌ వ్యూహాత్మక బలాన్ని ప్రతిబింబిస్తుందని ఆ దేశానికి చెందిన ప్రజాప్రతినిధి అలాద్దీన్‌ బౌరోజెర్దీ ఒక టీవీ కార్యక్రమంలో వ్యాఖ్యానించినట్లు మీడియా వెల్లడించింది.హర్మూజ్‌ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో పెద్దశాతం సాగుతుండటంతో, ఇరాన్‌ ఈ నిర్ణయం తీసుకుంటే అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)