Logo
Date of Publish : 07 March 2026, 6:42 am
Editor : Shankaragallu Venkatesulu

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి భూ వ్యవహారం.. షోకాజ్ నోటీసులు జారీ

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి భూ వ్యవహారం.. షోకాజ్ నోటీసులు జారీ

ధర్మవరం"అనంత జనశక్తి న్యూస్"

అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైసీపీ పాలనలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న భూ ఆక్రమణలకు సంబంధించి ఇద్దరు ఎమ్మార్వోలు యుగేశ్వరీదేవి, నీలకంఠారెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఈ వ్యవహారంపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కూడా సీఎస్ ఆదేశించారు.ఇదిలా ఉండగా, మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ‘యువగళం’ పాదయాత్రలో కేతిరెడ్డి గుర్రాల కోట, భూ ఆక్రమణల అంశం బయటపడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరోవైపు ధర్మవరం చెరువును కేతిరెడ్డి ఆక్రమించారని ఆరోపిస్తూ తుంపర్తికి చెందిన పరమేష్ అనే వ్యక్తి చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు సమాచారం.ఈ వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)