ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితి ఇలానే ఉంటుంది
ఆరోజు పరిటాల రవిని చంపిన కేసులో జగన్ ఉన్నాడు
ఆయనలాగా చంద్రబాబుపై కూడా అవినీతి మచ్చ ఉండాలనుకుంటున్నారు
చంద్రబాబు అరెస్టుపై గ్రామస్థాయి నుంచి ఖండాంతరాల వరకు నిరసన పెల్లుబుకుతోంది
రాజమండ్రిలో మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలు
నారా భువనేశ్వరి, బ్రాహ్మని, నందమూరి బాలకృష్ణను కలసిన సునీత
ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూస్తున్నామని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాజమండ్రిలో ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మని, నందమూరి బాలకృష్ణను ఆమె కలిశారు. చాలాసేపు వారితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకున్నారు. అలాగే నారా భువనేశ్వరికి ధైర్యం చెప్పారు. మీ వెంట తెలుగుదేశం పార్టీ మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలంతా ఉన్నారన్నారు. ఈ సమావేశం అనంతరం పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ ఏ తప్పు చేయని చంద్రబాబు జైలుకు వెళ్లారంటే జగన్ అరాచక పాలనకు ఇది నిదర్శనంగా నిలుస్తోందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ అంశంలో చంద్రబాబు చేసిన తప్పేంటన్నది ఇప్పటివరకు అధికార పార్టీ నాయకులు కానీ సిఐడి అధికారులు కానీ చెప్పలేకపోతున్నారన్నారు. ఆయన డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్ళించారన్నది చెప్పలేకపోతున్నారన్నారు. కేవలం అబద్ధాలు చెబుతూ జరగని స్కాం ను… జరిగినట్టు చూపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబును జైలుకు పంపడం అత్యంత బాధాకరమన్నారు. ఆయన అరెస్టు తర్వాత గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు అలాగే ఖండాంతరాలు దాటి తెలుగు వారు ఎక్కడున్నా నిరసనలు తెలియజేస్తున్నారన్నారు. ఆయన టెక్నాలజీని ప్రోత్సహించిన కారణంగా లక్షలాదిమంది ఉద్యోగాలు పొంది స్థిరపడ్డారని సునీత గుర్తు చేశారు. ఓవైపు చంద్రబాబు.. మరోవైపు లోకేష్ యాత్రల ద్వారా జనంకు దగ్గరవుతున్నారని .. అదే సమయంలో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువైందన్న భయంతో చంద్రబాబును ఎన్నికల ముందు జైలుకు పంపారన్నారు. మీరు ఈ అరెస్టు ద్వారా తెలుగుదేశం పార్టీని ఆపలేరని స్పష్టం చేశారు. కచ్చితంగా చంద్రబాబు బయటికి రావడం ఖాయమని అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు చేసిన అరాచకాలపై విచారణ చేయిస్తామన్నారు అప్పుడు ఇక్కడ జైలు సరిపోకపోవచ్చని సునీత అభిప్రాయపడ్డారు. నేరపూరిత స్వభావమున్న జగన్ గతంలో పరిటాల రవి హత్య కేసులో కూడా ఉన్నారని ఈ సందర్భంగా పరిటాల సునీత గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుపై కక్ష కట్టి జైలుకు పంపారని మండిపడ్డారు…