యోగా, ఆయుర్వేదం లాంటి వైద్య విధానాలను జర్మనీకు పరిచయం చేయండి: జర్మన్ కాన్సుల్ జనరల్
వైద్య విద్యార్థులకు వీసాలు ఇవ్వండి: మంత్రి రజిని
జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్‌లో ఆంధ్రపదేశ్ రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ తెలిపారు. వైద్య విద్యార్థుల పరస్పర మార్పిడి, వైద్య పరిశోధనలో పరస్పర సహకారానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె వెల్లడించారు. ఆ మేరకు ఎంఓయూలు కుదుర్చుకుందామని ప్రతిపాదించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ఉన్న అవకాశాలను తమతో చర్చిస్తే.. ఆ మేరకు కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. భారతీయులు, ముఖ్యమంగా తెలుగువారి మేధాశక్తిపై తమకు ఎంతో నమ్మకం ఉందని అన్నారు. యోగా, ఆయుర్వేదం లాంటి వైద్య విధానాలను మా దేశంలో కూడా అందుబాటులోకి తీసుకురండి: జర్మన్ కాన్సుల్ జనరల్ కోవిడ్ సమయంలో భారతదేశం అందించిన తోడ్పాటుకు జర్మనీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని కాన్సుల్ జనరల్ కుచ్లర్ తెలిపారు.