Search
Close this search box.
Search
Close this search box.

హవ్వ… కొండపై అక్రమంగా కొంప కట్టుకున్న వ్యక్తిని భగవంతుడితో పోల్చడమా?

హవ్వ… కొండపై అక్రమంగా కొంప కట్టుకున్న వ్యక్తిని భగవంతుడితో పోల్చడమా?

సి ఆర్ జెడ్ నిబంధనలు తెలియని జ్ఞాన శూన్యులు ఆ ఇద్దరు మంత్రులు…

టూరిజం కాటేజీల ముసుగులో కాపురం కోసం ముఖ్యమంత్రి గారు కట్టుకున్న భవనాన్ని కూల్చాల్సిందే…

300 మంది టీడీపీ నాయకులపై పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసు కోర్టు కొట్టి వేయడం ఖాయం…

జగన్ మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రతిపక్షాలు చేస్తుంది నిరాధారమైన ఆరోపణలా?, నిజ ఆరోపణలన్నది నిగ్గు తేల్చాలి…

షర్మిల దెబ్బకు మా పార్టీ మూడు నుంచి నాలుగు శాతం ఓట్లు కోల్పోవడం ఖాయం…

ఎమ్మెల్యేను టీటీడీ చైర్మన్ గా నియమించడం నిబంధనలకు విరుద్ధం…

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు 

రుషికొండపై అక్రమంగా కొంప కట్టుకున్న వ్యక్తిని మంత్రులు భగవంతుడితో పోల్చడం విడ్డూరంగా ఉందని, తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, శ్రీశైలం కొండపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవాలయాలు నిర్మించినట్లుగానే, రుషికొండపై జమోరె  నిర్మించిన అక్రమ భవనాన్ని మంత్రులు పోల్చి చూపించడం చూస్తే వారికి మతి అన్నది లేకుండా పోయిందని స్పష్టమవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు  మండిపడ్డారు. రుషికొండపై జగన్ మోహన్ రెడ్డి  తన కొత్త కాపురం కోసం భవనాన్ని నిర్మించుకుంటే, ఆ భవనాన్ని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాలతో పోల్చిన మంత్రులు పిచ్చి ప్రేలాపనలు చూస్తుంటే ఇంతకంటే దురదృష్టకరం మరొకటి లేదన్నారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, రోజాలు గార్లు జగన్ మోహన్ రెడ్డిని భగవంతుడిగా అభివర్ణించే ప్రయత్నాన్ని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో పెయిడ్ ఆర్టిస్ట్ ఒకరు తన కలాన్ని తాకట్టు పెట్టి కిరాయి వ్యాఖ్యలు రాసి, మంత్రుల చేత పలికిస్తున్నారన్నారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. తిరుమల, శ్రీశైలం గుట్టలు సముద్రానికి దగ్గరగా లేవని, సముద్ర మట్టానికి 150 నుంచి 250 మీటర్ల పరిధిలో సి ఆర్ జెడ్ జోన్ నిబంధనలు ఉంటాయని, రిషికొండపై టూరిజం కాటేజీల ముసుగులో జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన అక్రమ భవనం సి ఆర్ జెడ్ జోన్ పరిధిలోకి వస్తుందన్నారు. సి ఆర్ జెడ్ జోన్ లో కొన్ని నిబంధనలు ఉంటాయన్న అవగాహన కూడా లేకుండా మాట్లాడిన ఇద్దరు మంత్రులు జ్ఞాన శూన్యులేనని అర్థమవుతోందని అన్నారు. సి ఆర్ జెడ్ జోన్ పరిధిలో పర్యాటక కార్యకలాపాలకు మాత్రమే కొంతమేర అనుమతిని ఇస్తారని, సముద్రానికి 150 మీటర్ల దూరంలో నివాస సముదాయాన్ని కట్టుకొని పొద్దున్నే లేచి భార్యాభర్తలిద్దరికి సముద్రాన్ని చూడాలనుకునే పిచ్చి ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ప్రజా వేదికలో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసి, అనుమతులు లేకుండా ఈ భవనాన్ని నిర్మించారని కూల్చివేసి జగన్ మోహన్ రెడ్డి నీతి వ్యాఖ్యలు, సోది వ్యాఖ్యలు చెప్పారన్నారు. రిషికొండపై నిర్మాణాల దరఖాస్తులోనే అనేక లోపాలు ఉన్నాయని, నాలుగు బ్లాకులకు నాలుగు పేర్లు పెట్టి, ముఖ్యమంత్రి  నివాస సముదాయం, వ్యక్తిగత క్యాంప్ కార్యాలయం, కార్యదర్శుల కార్యాలయాన్ని నిర్మించారన్నారు. రిషికొండపై నిర్మించింది ముఖ్యమంత్రి  నివాస భవన సముదాయమేనన్న రఘురామకృష్ణ రాజు , ఇది నిజం కాదని నిరూపించాలంటూ ముఖ్యమంత్రి కి సవాల్ చేశారు. రిషి కొండపై నిర్మాణాలకు టూరిజం కార్యకలాపాలకు సంబంధం లేదని, రాష్ట్రంలో 100% మళ్లీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, రిషికొండపై నిర్మించిన ఈ భవన సముదాయాన్ని భార్యాభర్తల పేరు మీద కాకుండా, వేరొకరి పేరు మీద 99 సంవత్సరాలు లీజుకు తీసుకోని వారి వద్ద నుంచి భార్యాభర్తలిద్దరూ కొద్ది కాలం పాటు అద్దెకు తీసుకున్నట్టుగా ప్రజల్ని నమ్మించడానికి కుట్ర జరుగుతున్నట్టు వార్తా కథనాలు వినిపిస్తున్నాయని, రిషికొండపై నిర్మించింది పూర్తిగా అక్రమ కట్టడం అని, సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుకు భిన్నంగా నిర్మాణాలను చేపట్టారని అన్నారు. గతంలో కాటేజీలు ఉన్నచోట వాటిని తొలగించి, అదే స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాటేజీలు ఉన్నచోట కాకుండా కొండ దిగువన భారీ భవన నిర్మాణాన్ని చేపట్టిందని, విశాఖపట్నం నుంచి భీమిలికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఈ నిర్మాణాలు చేపట్టారని, తప్పు చేశారు కాబట్టే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. మంత్రులు పిచ్చివాగుడు, డబ్బా వాగుడు వాగుతున్నారని, మంత్రులతో ముఖ్యమంత్రి ఇలా మాట్లాడించడం మన కర్మ అని, ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని చెబుతున్న పవన్ కళ్యాణ్  ప్రభుత్వం మారిన తర్వాత ఢిల్లీలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చిన విధంగానే, విశాఖలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తామని తన విశాఖపట్నం పర్యటనలో చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి  టూరిజం కాటేజీల ముసుగులో కొత్త కాపురం కోసం నిర్మించుకున్న భవనాన్ని కూడా కూల్చివేయాలని రఘురామకృష్ణ రాజుకోరారు. కూల్చివేసే బాధ్యతను రేపు నూతనంగా ఏర్పడనున్న ప్రభుత్వం తీసుకోవాలని, ఈ భవన సముదాయ నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా చెబుతున్నారని, ఈ పాలకుల వల్ల ప్రజలు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని, పనికిమాలిన పాలకులకు గుణపాఠం రావాలంటే, ఈ తరహా అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందేనని రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. రిషికొండ అక్రమ నిర్మాణంపై తన ప్రస్తుత పార్టీ అధికారిక వెబ్సైట్లో ఒక ట్వీట్ చేశారని, రిషి కొండపై సెక్రటేరియట్, సెక్రటరీల భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారని, ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు కడితే తప్పా అని ప్రశ్నించిన కొద్దిసేపటికే, ఆ ట్వీట్ ను తొలగించారని, కోర్టు ధిక్కరణ కింద అడ్డంగా దొరికిపోతామనే ఆ ట్విట్ తొలగించి వేశారని, ఆ తరువాత తమ వంది మాగాదులను రంగంలోకి దింపి, వారి చేత నోటికొచ్చినట్లు మాట్లాడించారని రఘురామకృష్ణ రాజు తెలిపారు.  

పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుగా…

పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుగా విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారి కుటుంబం కిడ్నాప్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని కోరుతూ తాను గతంలో ప్రధానమంత్రికి లేఖ రాయగా, ఎం వివి సత్యనారాయణ తనను పార్లమెంట్లో దూషించిన విషయం తెలిసిందేనని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని విశాఖపట్నం సభలో ప్రస్తావించారని, ఎంపీ కుటుంబ కిడ్నాప్ వ్యవహారం ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా అని పవన్ కళ్యాణ్  ప్రశ్నిస్తే, ఎం వివి సత్యనారాయణ తిట్టాడా?, లేకపోతే ముఖ్యమంత్రి తిట్టించాడా తెలియదు కానీ దమ్ముంటే నాపై పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ కి ఎంవివి సత్యనారాయణ సవాలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టికెట్లు దక్కవని భావిస్తున్న నాయకులంతా పవన్ కళ్యాణ్ ని తమపై పోటీ చేయమని సవాల్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగైనా తమకు రానున్న ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయని భావిస్తున్నట్లుగా ఉందని, తనను తిట్టినందుకు జోగి రమేష్ లాంటోడికి మంత్రి పదవి ఇచ్చినట్లుగానే, పవన్ కళ్యాణ్ ని తిడితే ముఖ్యమంత్రి టిక్కెట్లు ఇస్తాడని తమ పార్టీ నాయకులు భావిస్తున్నారు కాబోలు అని అన్నారు. క్రైస్తవ సమాజానికి చెందిన స్థలంలో నాలుగు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొని, 24 అంతస్తుల భవనం కడతామంటే రానున్న ప్రభుత్వంలో కూల్చివేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఈ ప్రభుత్వం కూలిపోతే, ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత రానున్న ప్రభుత్వానిదేనని, పవన్ కళ్యాణ్ చెబుతున్న నిజాలు ప్రజలకు ఎంతగా చేరుతున్నాయో ఆయన ప్రసంగాలకు లభిస్తున్న వ్యూవర్ షిప్ దానికి నిదర్శనం అని అన్నారు. రిషికొండ ప్రకృతి విధ్వంసం, వేల ఎకరాల భూముల ఆక్రమణ ద్వారా ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయాన్ని తన విశాఖపట్నం పర్యటనలో పవన్ కళ్యాణ్  పూసగుచ్చినట్లు వివరించారని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

చంద్రబాబు నాయుడుని చంపడానికి ప్రయత్నించి… విఫలం కావడంతో ఆయనపైనే తిరిగి కేసా?

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై దాడి చేసి హత్య చేయాలని చూసి, విఫలం కావడంతో ఆయనతో పాటు, మరో 300 మందిపై మూకుమ్మడిగా పోలీసు వ్యవస్థ ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ , తనపై కూడా పోలీసులు చిలిపి, చిల్లర కేసులు పెడతారని గ్రహించి దానికి సంసిద్ధులైనట్లే కనిపిస్తున్నారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. తనను అక్రమంగా అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టిన సంఘటన గురించి కూడా ప్రధానమంత్రికి రాష్ట్రపతికి రాసిన లేఖలలో చంద్రబాబు నాయుడు  ప్రస్తావించారని, తెలుగుదేశం పార్టీ నాయకులపై నమోదు చేసిన హత్యాయత్నం కేసు కోర్టులో వీగిపోతుందని తెలిసే, సాక్షి దినపత్రికలో ఈ కేసుపై సుప్రీంకోర్టులో కూడా పోరాడుతామని రాశారన్నారు. నిక్కర్లు వేసుకున్న వయసులోనే పులివెందులలో ఎస్సైపై దాడి చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారిదని రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు. ఇక ప్రతిపక్ష నేతగా కృష్ణా జిల్లా కలెక్టర్ ను దూషించారని గుర్తు చేశారు. అంగళ్ళు ఘటనలో పోలీసుల వేషంలో చంద్రబాబుని హతమార్చడానికి ఎవరైనా వచ్చి ఉంటారని, పోలీసులే రాళ్లతో దాడి చేసిన వీడియోలను చూశాం అని అన్నారు. గతంలో జోగి రమేష్ అనే వాడు చంద్రబాబు నాయుడు  ఇంటిపైకి దాడి చేయడానికి వెళితే, ఎటువంటి కేసు నమోదు చేయలేదని, ఆత్మ రక్షణ కోసం దాడి చేస్తున్న వారిపై ప్రతి దాడి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులపై మాత్రం కేసులు పెట్టారని, మూకుమ్మడిగా 300 మందిపై కేసు నమోదు చేస్తే న్యాయవ్యవస్థ కళ్ళు మూసుకొని కూర్చుంటుందా?, ఐదు నిమిషాల వ్యవధిలో ఈ కేసు కొట్టి వేస్తారని అన్నారు. జడ్జి గారిని ఫ్రీజుడీస్ చేసేందుకే సాక్షి దినపత్రికలో వార్తా కథనాన్ని రాసిందని, దీని ద్వారా ఇది తప్పుడు కేసు అని చెప్పకనే సాక్షి దినపత్రిక చెప్పినట్టయిందని అన్నారు.

నాకు కూడా అనుమానంగానే ఉంది…

జగన్ మోహన్ రెడ్డి మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని ప్రధానమంత్రి, రాష్ట్రపతి గార్లలకు రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు  ప్రస్తావించారని, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో కొనసాగాలంటే, మానసిక పరిస్థితి సరిగ్గా ఉండాలని, మనోవైకల్యంతో బాధపడే వారిని చికిత్స కోసం తరలించడానికి విధుల్లో నుంచి తొలగిస్తారని, అలాగే మానసిక పరిస్థితి సరిగ్గా ఉన్న వారు ఎవరు కూడా ఒక ఎంపీని చిత్రహింసలకు గురి చేయించి, ఆ వీడియో చూసి ఆనందించాలని అనుకోరని, మానసిక పరిస్థితి సరిగ్గా లేని వారు కూడా రాజ్యాంగ పదవులలో కొనసాగడానికి వీలు లేదని, ముఖ్యమంత్రి పై ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవా?, నిజమైన వా అన్నది నిగ్గు తేల్చాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా డిమాండ్ చేస్తున్నానని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించాలని, చంద్రబాబు నాయుడు కు ఉన్న అనుమానమే తనకు కూడా ఉందని, జగన్ మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై విచారణ జరిపితే, తనను లాకప్ లో చిత్రహింసలకు గురి చేసిన విధానాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తానని అన్నారు. తాను కూడా సీబీఐ ఎంక్వయిరీ కోరానని, కానీ గత రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని, యువ గళం పాదయాత్ర వ్యాల్యూమ్ పెరుగుతోందని, నారా లోకేష్ నిర్వహిస్తున్న సభలకు జనాదరణ రోజుకింత ఎక్కువవుతుందని రఘురామకృష్ణ రాజు  తెలిపారు.

మా పార్టీకి తగలనున్న షర్మిల  బాణం…

జగన్ మోహన్ రెడ్డి విడిచిన బాణం షర్మిల తమ పార్టీకే తగిలే అవకాశం కనిపిస్తోందని, షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే, దాని ప్రభావం తమ పార్టీపైనే తీవ్ర ఉండనుందని అన్నారు. తమ పార్టీకి చెందిన మూడు నుంచి నాలుగు శాతం ఓట్లపై షర్మిల తీవ్ర ప్రభావం చూపనుందని, క్రైస్తవ మతానికి చెందిన ఓటర్లను ఆమె తీవ్రంగా ప్రభావితం చేయనున్నారని, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే, బ్రదర్ అనిల్ కూడా ఆ పార్టీలో చేరినట్లేనని, క్రైస్తవ మత ఓటర్ల పై ఆయన ప్రభావం అధికంగా ఉండనుందని, గత ఎన్నికల్లో షర్మిల, ఆమె భర్త అనిల్ తనకు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి  చెప్పింది ఏది చేయరని, ఏదైతే చేశాడో అదే చెబుతారని అన్నారు. తల్లి, చెల్లి, బాబాయిని చూసినట్టుగానే ప్రజల్ని కూడా చూస్తున్నారని, కులము చూడను మతం చూడను అని చెబుతూ, తన కులం, తన మతాన్ని మాత్రమే చూసుకుంటున్నారని, తన గెలుపు కోసం కష్టపడిన తల్లి, చెల్లి, బామ్మర్దిని బయటకు గెంటేశారని, ద్వాపర యుగంలో కంసుడు చెల్లిని జైల్లో పెడితే, ఈ కంసుడు మాత్రం చెల్లిని రాష్ట్రాన్ని దాటించాడని రఘురామకృష్ణ రాజు  అన్నారు.

తిరుమలలో ఎప్పుడు జరగని దుర్ఘటన ఇది..

కలియుగానికి ముందు, శతాబ్దాల క్రితం వెలిసిన తిరుమలలో ఎప్పుడు జరగని దుర్ఘటన ఇప్పుడు జరిగిందని, శ్రీవారి దర్శనానికి వెళ్లే వారిని క్రూర మృగాలు చంపిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని, అడవి మార్గంలో, మెట్లు లేని సమయంలో కూడా భక్తులు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారని, కానీ ఇటీవల టీటీడీ చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం పరిశీలిస్తే, ఏదో అపరాధం జరిగితేనే ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటాయన్న పెద్దల మాటలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. నడక దారిలో చిరుత దాడి చేసి బాలికను చంపిన ఘటనపై ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారి ధర్మారెడ్డి చెప్పాల్సింది పోయి, నడక దారిని మూసేస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగిందని బస్సులు కూడా తిరగకుండా నిలిపివేస్తారా అంటూ అపహాస్యం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిని ఒక మత విశ్వాసానికి చెందిన ప్రార్థనా మందిరం చైర్మన్ గా నియమించడం నిబంధనలకు విరుద్ధమని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

విలన్ ను హీరోగా చూపే పంథా కలిగిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ …..

ప్రతి నాయకుడిని హీరోగా చూపే పంథా కలిగిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మని, ఆయన గతంల రూపొందించిన సత్య, సర్కార్ చిత్రాలు ఇదే కోవకు చెందినవని, ఇప్పుడు 32 కేసులు ఉన్నా జగన్ మోహన్ రెడ్డి జీవిత గాధను ఆధారంగా చేసుకుని రాంగోపాల్ వర్మ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, తాను అభిమానించే దర్శకుడు, అసహ్యించుకునే రాజకీయ నాయకున్ని హీరోగా చూపెట్టే సినిమా తీస్తున్నారని, బాబాయిని హత్య చేసిన సంఘటనలో వై.యస్. కుటుంబీకుల పాత్ర, తనను లాకప్ లో చిత్రహింసలకు గురి చేసిన సీన్లు ఈ సినిమాలో ఉండకపోవచ్చునని రఘురామకృష్ణ రాజు అన్నారు.

#RRR 💥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి