Logo
Date of Publish : 13 March 2026, 7:51 am
Editor : Shankaragallu Venkatesulu

బాలుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష

బాలుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష

శెట్టూరు మార్చి 13, అనంత జనశక్తి న్యూస్

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామంలో జరిగిన బాలుడి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జిల్లా కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న గొల్ల చిత్తప్ప, గొల్ల ఈరన్న, మురుకుందప్పలకు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కోర్టు తీర్పు ప్రకారం మొదటి నిందితుడు గొల్ల చిత్తప్పకు రూ.25,000, రెండో నిందితుడు గొల్ల ఈరన్నకు రూ.50,000, మూడో నిందితుడు మురుకుందప్పకు రూ.10,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది.కేసు వివరాల్లోకి వెళితే, తిప్పనపల్లి గ్రామానికి చెందిన సన్న ఈరన్న, చిత్తప్పలు అన్నదమ్ములు. వీరి మధ్య భూ తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 2022 ఏప్రిల్ 6న మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో సన్న ఈరన్న కుమారుడు విష్ణువర్ధన్ (11) తన చిన్నాన్న గొల్ల చిత్తప్ప తోటలోకి నీళ్లు తాగేందుకు వెళ్లాడు. అక్కడ మామిడిపండు, వేరుశనగ కాయలు తీసుకున్న విషయంపై చిత్తప్ప బాలుడిని ప్రశ్నించాడు. దీనికి బాలుడు “ఈ తోటలో నాకు కూడా హక్కు ఉంది” అని చెప్పడంతో కోపోద్రిక్తుడైన చిత్తప్ప, గొల్ల ఈరన్న, మురుకుందప్ప కలిసి బాలుడిపై దాడి చేసి అక్కడే ఉన్న తాడుతో మెడకు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని టార్పాలిన్‌లో చుట్టి గడ్డివాములో దాచిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ ఘటనపై బాలుడి తండ్రి సన్న ఈరన్న శెట్టూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై యువరాజు కేసు నమోదు చేశారు. కళ్యాణదుర్గం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాసులు కేసును దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా కేసు పర్యవేక్షణ జరిగింది. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ సీఐ విజయభాస్కర్ గౌడ్, కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంఠేశ్వర్ పర్యవేక్షణలో విచారణ కొనసాగింది. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వనమాల సుబ్బలక్ష్మి వాదనలు వినిపించారు.విచారణ అనంతరం గౌరవ జిల్లా జడ్జి ఈ. భీమారావు తుది తీర్పు ప్రకటించారు. ఈ కేసులో సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరు పరచడంలో కీలక పాత్ర పోషించిన కోర్టు మానిటరింగ్ సిస్టమ్ జిల్లా లైజన్ ఆఫీసర్ ఏఎస్ఐ వై. మారెన్న, జిల్లా కోర్టు ఏఎస్ఐ ఎస్. మల్లిరెడ్డి, కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు కృష్ణమోహన్, రామమోహన్, కుళ్లాయిస్వామిలను జిల్లా ఎస్పీ పి. జగదీష్, కళ్యాణదుర్గం డీఎస్పీ అభినందించారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)