Logo
Date of Publish : 06 January 2026, 4:13 am
Editor : Shankaragallu Venkatesulu

రూ.4 దొంగతనం కేసు.. 51 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తీర్పు

రూ.4 దొంగతనం కేసు.. 51 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తీర్ప

పుణె జనవరి 06,అనంత జనశక్తి న్యూస్

1974లో పుణెలోని బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గడియారం, రూ.4 నగదు, చేతి రుమాలు దొంగతనం కేసు నమోదైంది. ఈ ఘటనలో గులాబ్ సాహు జాదవ్, ముకుంద కెర్కా వాగ్మారే, రాజారాం తుకారాం కాలేపై పోలీసులు కేసు నమోదు చేశారు.1975 ఏప్రిల్ 10న గులాబ్ సాహు జాదవ్, ముకుంద కెర్కా వాగ్మారే నేరం అంగీకరించడంతో కోర్టు వారిని దోషులుగా తేల్చింది. అయితే రాజారాం కాలే అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.51 సంవత్సరాలకు పైగా గడిచినా రాజారాం కాలేపై నేరాన్ని నిరూపించే స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో, పుణె జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్.జే. చవాన్ 2025 డిసెంబర్ 26న ఆయనపై జారీ చేసిన అన్ని వారెంట్లను రద్దు చేశారు. అనంతరం రాజారాం కాలేను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)