సీఐడీ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమయింది. మార్గదర్శి కేసులో ఆయనను ప్రశ్నిస్తామంటూ ఇంటికి వెళ్లి ఇంట్లోనే ఫోటోలు, వీడియోలు తీశారు. వాటిలో కొన్ని రహస్యంగా కూడా తీశారు. అవన్నీ కాన్ఫిడెన్షియల్. కోర్టుకు సమర్పించాల్సినవి. విచారణ వీడియోలు. కానీ అవి సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. . మొదట కొన్ని పెయిడ్ అకౌంట్ల నుంచి వెలుగులోకి వచ్చాయి. తర్వాత వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసింది. సీఐడీ అధికారులు ఇంత నీచంగా ఉన్నారేమిటని విమర్శలు ప్రారంభమయ్యాయి. నైతికంగా సీఐడీ ఏస్థాయిలో ఉందో అందరికీ తెలుసు కానీ ఇది మ్యాటర్ ఆఫ్ జ్యూరిస్ డిక్షన్ అని. ఓ కేసు విషయంలో అనుమానితుల్ని ప్రశ్నించి రికార్డు చేసిన స్టేట్‌మెంట్లు.. సేకరించిన సాక్ష్యాలు హైలీ కాన్ఫిడెన్షియల్.. బయటకు రాకూడదు. వస్తే దర్యాప్తు సంస్థదే బాధ్యత. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యాయవ్యవస్థను ఇది తక్కువ చేయడమేనని.. ఈ వీడియోలు మార్గదర్శి విచారణలో కీలకం అవుతాయన్న భావన వినిపిస్తోంది. మార్గదర్శిపై ఒక్క ఆరోపణ లేకుండా దర్యాప్తు చేసి బురదచల్లి… ఇళ్లల్లో కూడా సోదాలు చేసి… వీడియోలు తీసి బయటపెట్టడం అంటే.. చిన్న విషయం కాదంటున్నారు. న్యాయపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసిన తర్వాత ఆ వీడియోలను కొంత మంది తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. కానీ అలా డిలీట్ చేసినంత మాత్రాన.. తప్పు దిద్దుకుననట్లు అవుదు కదా. మొత్తం రికార్డెడ్ సాక్ష్యాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు.. సీఐడీ చీఫ్ కూడా కేసుల్లో ఇరుక్కోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో ముందు ముందు క్లారిటీ రానుంది.
One Response
తప్పు చేసిన రామోజీ కన్నా సీఐడీ మీద కోపమున్నట్లుంది మీకు.