నాకు ఏదైనా జరిగితే మీరే బాధ్యులు..
ట్రోల్స్‌కు బుల్లితెర నటి కీర్తి భట్ షాకింగ్ వార్నింగ్
అనంత జనశక్తి న్యూస్
బుల్లితెర నటి కీర్తి భట్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2023లో నిశ్చితార్థం చేసుకున్న ప్రియుడు కార్తీక్‌తో పెళ్లికి ముందే విడిపోయిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.విడిపోవడానికి కారణంగా తాను ఆర్థికంగా స్థిరంగా లేనందున కీర్తి తనను వదిలేసిందని, డబ్బున్న వ్యక్తిని చూసుకుందని కార్తీక్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలతో నెటిజన్లు కీర్తి భట్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు దిగారు.ఈ నేపథ్యంలో కీర్తి భట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సంచలన స్పందన ఇచ్చారు. తనపై జరుగుతున్నది తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేస్తూ, తనను దూషిస్తున్న వారందరి పేర్లను రాసిపెట్టుకున్నానని వెల్లడించారు. “నాకు ఏదైనా జరిగితే దీనికి కారణం వాళ్లే” అంటూ షాకింగ్ హెచ్చరిక చేశారు.కీర్తి చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ఉలిక్కిపడేలా చేస్తుండగా, సోషల్ మీడియాలో మరోసారి తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.