Logo
Date of Publish : 11 November 2025, 5:23 pm
Editor : Shankaragallu Venkatesulu

అధిక సంఖ్యలో భక్తులు రాకతో…. లాడ్జిలు ఫుల్….

అధిక సంఖ్యలో భక్తులు రాకతో.... లాడ్జిలు ఫుల్....

-ముందస్తుగా-10 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ లు.

- 10 లక్షల పైగా భక్తులు రాక... లాడ్జిలు కిటకిట.

- లాడ్జిలు దొరక్క పలువురు భక్తులు ఇబ్బందులు.

- ట్రస్ట్ ఆధ్వర్యంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు.

-ఎప్పుడూ లేని విధంగా.... పుట్టపర్తిలో పెరిగిన భక్తుల తాకిడి.

శ్రీసత్యసాయిజిల్లాప్రతినిధి, నవంబర్ 11, అనంత జనశక్తి న్యూస్:

పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి శత జయంతోత్సవాల సందర్భంగా భక్తుల సందడి రోజు రోజుకు పెరిగిపోతోంది. శతజయంతోత్సవాలు మరో 10 రోజులు ఉండగానే దేశ విదేశీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. శతజయంతోత్సవాలను సత్య సాయి ట్రస్ట్ భారీగా ఏర్పాటు చేస్తుండడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భగవాన్ సత్యసాయి బాబా ను దర్శించుకోవడానికి కోసం భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే పుట్టపర్తి తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉండే లాడ్జిలన్నీ నిండిపోయాయి. పది రోజులు ముందుగానే భక్తులు అడ్వాన్సు బుకింగులు చేసుకున్నారు. దీంతో పుట్టపర్తికి చేరుకునే భక్తులందరికీ విడిది సౌకర్యం కష్టతరంగా మారింది.

జయంతి రోజు పది లక్షల మంది పైగా భక్తులు వచ్చే అవకాశం....

భగవాన్ సత్యసాయిబాబా శతజయంతోత్సవాన్ని పురస్కరించుకొని 23వ తేదీన జయంతోత్సవాలను భారీ ఎత్తున జరప తలపెట్టారు. సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న జయంతోత్సవాలకు దేశ విదేశాల నుంచి 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రస్టు సభ్యులు అంచనా వేస్తున్నారు. తగ్గట్టు ఏర్పాటు కూడా కొనసాగిస్తున్నారు. 13వ తేదీ నుంచి నారాయణ సేవ (అన్నదానం) నిర్వహించేందుకు ట్రస్టు సభ్యులు అన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టపర్తి వస్తున్న సందర్భంగా ఇప్పటికే భారీ భద్రత ఏర్పాట్లను అటు పోలీసు యంత్రాంగం ఇటు ట్రస్ట్ సభ్యులు కొనసాగిస్తున్నారు. 22వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్త వస్తున్న సందర్భంగా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు సత్య సాయి ట్రస్ట్ చేస్తోంది. 18 తేదీ నుంచి సత్యసాయి జయంతోత్సవాలు ఆదికారికంగా కొనసాగనున్నాయి.

పది రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ లు....

సత్య సాయి బాబా జయంతిని పురస్కరించుకొని భక్తుల తాకిడి పెరగడంతో పాటు భారీగా తరలివస్తుండడంతో లాడ్జిలన్నీ ఇప్పటికే నిండిపోయాయి. సత్య సాయి బాబా వంద జయంతిని సత్యసాయి ట్రస్ట్ భారీ ఎత్తున నిర్వహిస్తుండడంతో లాడ్జిలన్నీ నిండిపోయాయి. 10 రోజుల ముందే లాడ్జిలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడంతో లాడ్జ్ యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తి లో 150 లాడ్జిల ద్వారా 1500 నుంచి 2000 దాకా అద్దె రూములకు పది రోజులు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి బుకింగ్ చేసుకున్నట్లు లాడ్జ్ యజమానుల ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా సూపర్ హాస్పిటల్ వద్ద కూడా లాడ్జిలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఇక్కడ కూడా దాదాపు 700 అద్దె గదులు ఉన్నట్లు భక్తుల ద్వారా తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే హాస్పిటల్లో ఉండే పేషంట్లతో పాటు భక్తులు కూడా రాకతో సందడి నెలకొంది.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)