మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల
జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఆనంద్
అనంతపురం, అక్టోబర్ 2: అనంత జనశక్తి న్యూస్
జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఆ మహనీయుల చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డిఆర్ఓ మలోలా పలు శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్మా ట్లాడుతూఎందరోమహనీయుల త్యాగాల ఫలితంగా భారతదేశస్వాతంత్రంసాధించుకున్నామని త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు.దేశ స్వాతంత్ర సాధన కోసం జాతిపిత మహాత్మా గాంధీ మరియు బహుదూర్ శాస్త్రి లాంటి మహానుభావులు శాంతిమార్గాన్నిఎన్నుకొని ఆనాటిబ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి దేశ స్వాతంత్రం కోసం జాతికి చేసిన సేవలుఎనలేనివని కలెక్టర్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ అహింసనుఆయుధంగా మలుచుకొనిప్రజలనుచైతన్యవంతంచేసిస్వాతంత్రసంగ్రామంలోకీలకపాత్రవహించారన్నారు. మహాత్మాగాంధీఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. మహనీయుల జీవితాలనునేటితరంఆదర్శంగా తీసుకోవాలన్నారు.జాతిపిత మహాత్మా గాంధీజీ అందించిన స్ఫూర్తితో ప్రతి గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా గాంధీజీ ఆలోచనలను ముందుకు తీసుకోవలసిన బాధ్యత నేటి యువతపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహనీయుల ఆశయసాధనకుకృషిచేయాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు.మహాత్మా గాంధీజీ జన్మదినం రోజున మరొకమహనీయుడైన లాల్ బహుదూర్ శాస్త్రి కూడా జన్మించారని తెలిపారు.భారతదేశప్రధానిగాసేవలందించి ప్రజలందరి మన్ననలు పొందారన్నారు.ప్రముఖ స్వాతంత్ర యోధుల్లో లాల్ బహుదూర్ శాస్త్రి నిరాడంబ రమైన జీవితం కొనసాగించి నిబద్ధతకు మారుపేరుగా నిలిచారన్నారు. ముఖ్యంగా ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి స్వాతంత్ర ఉద్యమంలో సైనికులు ,రైతుల పాత్రను గుర్తుచేస్తూ జై జవాన్ - జై కిసాన్ నినాదాన్ని ప్రజలకు చేరువుగాతీసుకెళ్లిచైతన్యవంతం చేశారని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి లాంటి మహనీయులు దేశ సేవలో చేసినత్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని కలెక్టర్ తెలిపారు.