Logo
Date of Publish : 29 October 2025, 4:56 am
Editor : Shankaragallu Venkatesulu

వర్షాలకు కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు

వర్షాలకు కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు

కడప అక్టోబర్ 29, అనంత జనశక్తి న్యూస్

తుపాను కారణంగా బ్రహ్మంగారిమఠంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి నివాస గృహం కూలింది..బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు ఆయన నివాస గృహాన్ని కాపాడుకో లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.. బ్రహ్మంగారి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారి నివాస గృహాన్ని సందర్శిస్తారు..కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బ్రహ్మంగారి మఠం అభివృద్ధి చేస్తున్నామన్న అధికారులు నివాస గృహం పట్ల అలసత్వం వహించడంతోనే కూలింది అంటున్న భక్తులు.. అటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నా నివాస గృహం కూలిపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)