Logo
Date of Publish : 23 October 2025, 11:49 am
Editor : Shankaragallu Venkatesulu

20రోజుల్లో రాప్తాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి పై రాకపోకలు ప్రారంభిస్తాం

20రోజుల్లో రాప్తాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి పై రాకపోకలు ప్రారంభిస్తాం

గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఇంత ఆలస్యమైంది.. ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన సునీత

పనులు వేగవంతంగా చేయాలని ఆదేశం

ప్రకాష్ రెడ్డికి దోచుకునే దానిమీద ఉన్న శ్రద్ధ.. ప్రజల సమస్యల మీద లేదు

రాప్తాడు అక్టోబర్ 23, అనంత జనశక్తి న్యూస్

గత 8ఏళ్లుగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన రాప్తాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద.. 20 రోజుల్లో రాకపోకలు ప్రారంభిస్తామని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. గురువారం జాతీయ రహదారి అధికారులు, కాంట్రాక్టర్లు, టిడిపి నాయకులతో కలిసి ఆమె రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ప్రస్తుతం పనులు ఎంతవరకు వచ్చాయి.. ఎప్పటిలోగా రాకపోకలు ప్రారంభిస్తారన్న అంశాల గురించి అధికారులను అడిగి ఆరా తీశారు. పనులను వేగవంతంగా చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ 2017లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ బ్రిడ్జి మంజూరైందన్నారు. మొత్తం 74 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసినట్లు చెప్పారు. అయితే పాత కాంట్రాక్టర్ 49 కోట్ల రూపాయల వరకు పనులు చేసి ఆ తర్వాత ఆలస్యం చేశారన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో దీని గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రకాష్ రెడ్డికి ప్రజల సొమ్ము దోచుకునే దానిపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడం మీద లేదన్నారు. నిత్యం తమను విమర్శించే ప్రకాష్ రెడ్డి గత ఐదేళ్లలో ఈ బ్రిడ్జి పనులు ఎందుకు పూర్తి చేయించలేకపోయారని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత స్థాయిలో దీని గురించి అనేకసార్లు మాట్లాడి తిరిగి పనులు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని..2026 మే నెలలోపు ఈ పనులు పూర్తిస్థాయిలో జరుగుతాయన్నారు. అయితే మరో 20 రోజుల్లో ఈ బ్రిడ్జి మీదుగా రాకపోకలు కూడా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపు 8 ఏళ్ల సమస్యకు మరో 20 రోజుల్లో పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు....


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)