Logo
Date of Publish : 06 March 2026, 4:28 am
Editor : Shankaragallu Venkatesulu

శ్రీశైలంలో నేటి నుంచి స్పర్శ దర్శనాలు

శ్రీశైలంలో నేటి నుంచి స్పర్శ దర్శనాలు – ఉగాది మహోత్సవాలకు ఏర్పాట్లు

"అనంత జనశక్తి న్యూస్"

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుంచి భక్తులకు శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలను ప్రారంభించారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం కరెంట్ బుకింగ్ ద్వారా స్పర్శ దర్శనం టిక్కెట్లను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు.నేటి నుండి ఈ నెల 15వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు రోజుకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేశారు.అలాగే ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాల సందర్భంగా 16 నుండి 20 వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతి కల్పించనున్నట్లు దేవస్థానం వెల్లడించింది.భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశముండడంతో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)