ప్రధాని పర్యటనకు పోలీసులతో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు
బాబా జయంతి వేడుకలకు రానున్న ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి....
పుట్టపర్తి రూరల్ నవంబర్ 16అనంత జన శక్తి న్యూస్.
శ్రీ సత్య సాయి బాబా శతజయంతోత్సవాల నేపథ్యంలో ఈ నెల 19 పుట్టపర్తికి విచ్చేస్తున్న ప్రధాని మోదీ పర్యటన భద్రతా ఏర్పాట్ల గురించి బందోబస్తు నిమిత్తం విచ్చేసిన, వివిధ జిల్లాల ఎస్పీ లతోపాటు, అడిషనల్ ఎస్పీ లు , డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు , పోలీస్ సిబ్బందితో, అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోసి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడి దిశా నిర్దేశం చేశారు. ఈ సంధర్బంగా ఆదివారం రాత్రి జిల్లా పోలీస్ కార్యాలయ సమీపంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ఆవరణంలో బందోబస్తు నిమిత్తం విచ్చేసిన17 జిల్లాల పోలీసు అధికారులకు బ్రీఫింగ్ చేశారు. అనంతపురం రేంజ్ డిఐజి ,జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 22 ,23 రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతితో పాటు సీఎం, గవర్నర్లు, డిప్యూటీ సీఎం, వివిఐపి, వీఐపీలు సత్య సాయి బాబా శతజయంతి వేడుకలకు హాజరవుతారన్నారు. కావున ఈ కార్యక్రమంపై ఆయా సెక్టార్ ఇన్చార్జిలకు బ్రీఫింగ్ చేశారు. సత్యసాయి విమానాశ్రయంలో బందోబస్తు ఏర్పాట్లు, కాన్వాయ్ వెళ్లే రోడ్డు మార్గం, పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్స్ గురించి వివరిస్తూ జియో గ్రాఫికల్ మ్యాప్ ను చూపిస్తూ మాట్లాడారు. అడిషనల్ ఎస్పీ స్ధాయి నుండి ఎస్సై ర్యాంకు అధికారులు ఆయా సెక్టార్ ఇంచార్జ్ ఐపియస్ ల దగ్గర విధులు నిర్వహించాలన్నారు. ప్రధానమంత్రికి భధ్రత పరంగా పటిష్ట బందోబస్తు ఉంటుందన్నారు. విమానాశ్రయం నుండి వెళ్లే రోడ్డు మార్గం కాన్వాయి, పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ హాల్, హిల్యు స్టేడియంకు వెళ్లే సమయంలో బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేసిన పాయింట్లలో జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. అందరూ బాధ్యతగా పని చేయాలన్నారు.ఎయిర్ పోర్టు దగ్గర, కాన్వాయ్, పబ్లిక్ గ్యాలరీలు, పార్కింగ్ ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు.3, కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వీటి ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. ఈ సందర్భంగా 340 సీసీ కెమెరాలు ఏఎన్పిఆర్, మ్యాట్రిక్స్ కెమెరాలతో పాటు నైట్ డ్రోన్లు కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ప్రతి ఒక్కరినీ డి ఎఫ్ ఎం డి ద్వారా తనిఖీలు చేసి లోపలికి పంపాలని సూచించారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసేందుకు గట్టి చర్యలు చేపట్టామన్నారు. అందరూ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని వేడుకలను విజయవంతం చేయాలని వారు సూచించారు.ఈ సమావేశంలో ఆయా జిల్లాల నుండి వచ్చిన ఐపియస్ లు , అడిషనల్ ఎస్పీలు , డిఎస్పీలు , సిఐలు, ఆర్ ఐలు ఎస్సైలు పాల్గొన్నారు.