Logo
Date of Publish : 27 June 2026, 5:40 am
Editor : Shankaragallu Venkatesulu

ఏనుగుల దాడిలో రైతు దుర్మరణం బాధాకరం

ఏనుగుల దాడిలో రైతు దుర్మరణం బాధాకరం

అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్

తిరుపతి

తిరుపతి జిల్లా, పాకాల మండలం, పల్లగుట్టపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీ బి. తిమ్మారెడ్డి (65) ఏనుగుల దాడిలో దుర్మరణం పాలైన విషయం తెలుసుకొని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ చింతించారు.బాధాకరమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఏనుగుల సంచారం, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. శ్రీ తిమ్మారెడ్డి మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించి తక్షణం పరిహారం అందించాలని ఆదేశించారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)