Logo
Date of Publish : 02 October 2025, 1:56 pm
Editor : Shankaragallu Venkatesulu

రాబోయే తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే

హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ ఎంపికైన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

రాబోయే తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే

పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు

ఈ డీఎస్సీ కోసం మంత్రి లోకేష్ ఎంతో కష్టపడ్దారు

ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో హోం మంత్రి అనిత

వేంపాడు : అక్టోబర్ 2 అనంత జనశక్తి న్యూస్

పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 147 మంది ఉపాధ్యాయులకు గాను వేంపాడు టోల్ ప్లాజా సమీపంలోని భారతి కన్వెన్షన్ హాల్‌లో హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమం ప్రారంభంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి,కార్యక్రమాన్ని మంత్రి అనిత ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపికైన ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు, సన్మాన పతకాలు మరియు ప్రతి ఒక్కరికీ ఒక మొక్కను అందజేసి ఘనంగా సత్కరించారు. అలాగే, పాయకరావుపేట మండలం PL పురం గ్రామానికి చెందిన ధనలక్ష్మికి అపాయింట్మెంట్ ఆర్డర్‌ను మంత్రి స్వయంగా అందించారు.ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాబోయే తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. మీరు అందరూ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు.పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారన్నారు. ఈ మెగా డీఎస్సీ ప్రక్రియలో 140 కోర్టు కేసులు ఎదురైనా, ప్రభుత్వం పట్టుదలగా ముందుకు సాగిందని చెప్పారు. మంత్రి

లోకేష్ ఈ డీఎస్సీ కోసం తపస్సు చేసినట్టు, ఎంతో కష్టపడి ఈ విజయాన్ని సాధించారన్నారన్నారు.

సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఇప్పటివరకు 9 డీఎస్సీలు నిర్వహించబడ్డాయని, తాను కూడా 2002లో టీచర్‌గా చేరారని తెలిపారు. మీరు ఏ పాఠశాలలో జాయిన్ అవుతారో, అక్కడే నేను అందించిన మొక్కను నాటి సంరక్షించండి అని ఉపాధ్యాయులకు సూచించారు. మంత్రి లోకేష్ విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకువచ్చారని, పాఠశాలలు దేవాలయాలంటూ భావించి, అక్కడ ఎలాంటి సమావేశాలు, వేడుకలు నిర్వహించకూడదని స్పష్టం చేశారని పేర్కొన్నారు.కార్యక్రమం ముగింపులో మంత్రి ఉపాధ్యాయులతో కలిసి భోజనంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులంతా హోం మంత్రి అనిత గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)