Logo
Date of Publish : 09 December 2025, 4:15 am
Editor : Shankaragallu Venkatesulu

ఐటి మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వండి

ఐటి మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వండి

ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మతో మంత్రి లోకేష్ భేటీ

శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): ఓప్స్ ర్యాంప్ (ops ramp) సీఈవో వర్మ కూనపునేనితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఏపీలో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌ల కోసం ఐటీ మౌలిక సదుపాయాల ఆధునీకరణకు మద్దతు ఇవ్వండి. ఏఐ ఓప్స్ శిక్షణ, ఇంటర్న్ షిప్ లు, ఆర్ అండ్ డి సహకారం కోసం ఏపీ టెక్ అకడమియాతో భాగస్వామ్యం వహించండి. స్కేలబుల్ SaaS మోడల్స్ ద్వారా ఐటి కార్యకలాపాల నిర్వహణతోపాటు ఏపీలో SMEలు, స్టార్టప్‌లను ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా మా సంస్థకు 500+ సంస్థలు కస్టమర్లుగా ఉన్నాయి. వీటిలో ఫైనాన్స్, హెల్త్‌కేర్, రిటైల్, టెక్నాలజీలో పాటు ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఉన్నాయి. భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్ లో ప్రధాన కేంద్రాల ద్వారా ఏఐ ఓప్స్, క్లౌడ్ నేటివ్ మానిటరింగ్ లో ఆవిష్కరణలను ముందుకు తెస్తున్నామని తెలిపారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వర్మ పేర్కొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)